లిబరల్ ఎడ్యుకేషన్‌లో అగ్రగామిగా పేరొందిన అశోక యూనివర్సిటీ (Ashoka University).. యంగ్ ఇండియా (Young India) ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2023 -24 బ్యాచ్ కోసం తాజాగా స్కాలర్షిప్ను ప్రకటించింది. ప్రతిభ ఉన్న అభ్యర్థులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి ఈ యూనివర్సిటీ 10 ఛాన్సలర్స్ మెరిట్ స్కాలర్ షిప్‌లను అందించనుంది. వంద శాతం ట్యూషన్ ఫీజులు, రెసిడెన్స్ ఖర్చులు ఇందులో కవర్ కానున్నాయి. ఈ ప్రోగ్రామ్‌కు స్కాలర్షిప్ (Scholarship) ప్రకటించడం ఇదే తొలిసారి. యంగ్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది అశోక యూనివర్సిటీ అందించే ప్రధాన కోర్సు. దీన్ని లిబరల్ స్టడీస్‌లో వన్ ఇయర్, ఫుల్ రెసిడెన్షియల్, మల్టీ డిసిప్లినరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుగా డెలివర్ చేస్తోంది. ఈ ప్రోగ్రామ్ 2023-24 బ్యాచ్ కోసం అభ్యర్థులు అక్టోబర్ 31 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. యంగ్ ఇండియా ఫెలోషిప్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులను ఎఫెక్టివ్ లీడర్స్‌గా, ఛేంజ్ మేకర్స్‌గా తయారు చేయడమే తమ లక్ష్యమని యూనివర్సిటీ పేర్కొంది.
వారికి ప్రోత్సాహకంగా..
యంగ్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులకు అశోక యూనివర్సిటీలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందన్నారు అశోక యూనివర్సిటీ చాన్సలర్, హిస్టరీ ప్రొఫెసర్ రుద్రాన్షు ముఖర్జీ. ఈ ప్రోగ్రామ్‌తో అభ్యర్థులు ఎడ్యుకేషన్ , లెర్నింగ్ వరల్డ్‌లో ఉన్నత స్థానానికి చేరడానికి యూనివర్సిటీ కృషి చేసిందని చెప్పారు. ‘ప్రస్తుతం యంగ్ ఇండియా ఫెలోస్ కోసం ఛాన్సలర్స్ మెరిట్ స్కాలర్షిప్లను వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇది ప్రతి సంవత్సరం యంగ్ ఇండియా ఫెలోగా మారే అత్యుత్తమ వ్యక్తులను గుర్తిస్తుంది. స్కాలర్షిప్ అనేది అభ్యర్థులు అత్యుత్తమంగా రాణించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.’ అని ముఖర్జీ పేర్కొన్నారు.
స్కాలర్షిప్ ఎంపిక ప్రక్రియ
ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. అయితే వారు అకడమిక్, నాన్-అకడమిక్, ప్రొఫెషనల్స్‌కు సంబంధించిన విషయాల్లో బాగా రాణించి ఉండాలి. అలాగే వారిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఇలాంటి ప్రత్యేకమైన అభ్యర్థులను సమగ్ర అడ్మిషన్ ప్రాసెస్, అడిషనల్ స్కాలర్షిప్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ద్వారా గతంలో 2100 మందికి పైగా అభ్యర్థులు శిక్షణ పొందారు. వీరు ప్రభుత్వం, పౌర సమాజం, అభివృద్ధి, అకడమిక్, పరిశోధన, క్రీడలు, ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్, మల్టిలేటరల్ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ రంగం, ఎంటర్ ప్రెన్యూవర్‌షిప్ వంటి రంగాల్లో మార్పు కోసం పనిచేస్తున్నారు.
యూనివర్సిటీకి గుర్తింపు
హర్యాణా కేంద్రంగా పనిచేసే అశోక యూనివర్సిటీ ప్రపంచంలోని అత్యుత్తమ విద్యతో సమానంగా లిబరల్ ఎడ్యుకేషన్ అందిస్తోంది. విద్యార్థులు సమస్యలను వివిధ కోణాల్లో విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో లీడర్స్‌గా ఎదగడం వంటి విషయాలపై వర్సిటీ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అశోక యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విధానం, ఫండమెంటల్ నాలెడ్జ్‌తో పాటు రియల్ వరల్డ్ సవాళ్లపై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ విద్యాసంస్థలో ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ మెంబర్స్ నేతృత్వంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రపంచ స్థాయి ఇంటర్ డిసిప్లినరీ విద్యను అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Scholarship, Students