AS THE DEMAND FOR DIGITAL TALENT EXPLODES INFOSYS PLANS TO HIRE 45000 COLLEGE GRADUATES IN THIS YEAR GH SRD
Infosys Jobs: కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. కొత్తగా 45 వేల జాబ్స్.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Infosys Jobs: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్పోసిస్.. 2021 సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇన్ఫోసిస్‌లో పెరుగుతున్న అట్రిషన్ రేటు కారణంగా కొత్తగా కాలేజీ గ్రాడ్యుయేట్లను తీసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది.
కరోనాప్రభావానికి (Corona Effect) గురైన ఐటీ రంగం (IT Industry) గత కొన్ని నెలలుగా పరుగులు పెడుతోంది. పెద్ద ప్రాజెక్టులను దక్కించుకుంటున్న ఐటీ కంపెనీలు భారీగా నియామకాలు చేపడుతున్నాయి. దీనికి తోడు అట్రిషన్ (ఉద్యోగ వలసలు) రేటు కూడా పెరగడంతో సాఫ్ట్వేర్ జాబ్స్‌కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys Latest News).. ఈ ఆర్థిక సంవత్సరంలో 45,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. గతంలో 35,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, తాజాగా అది 45,000కు పెరిగింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్పోసిస్.. 2021 సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇన్ఫోసిస్‌లో పెరుగుతున్న అట్రిషన్ రేటు కారణంగా కొత్తగా కాలేజీ గ్రాడ్యుయేట్లను తీసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది.
పూర్తి స్థాయిలో మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈ ఏడాది కొత్తగా 45,000 కాలేజీ గ్రాడ్యుయేట్లను తీసుకుంటున్నట్టు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యం, వారి సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలు పెంచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, వారికి సరైన వృద్ధి అవకాశాలు కల్పించే ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు.
జూన్ త్రైమాసికం ముగిసేనాటికి 35,000 గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని భావించామన్నారు. అయితే డిజిటల్ విభాగంలో డిమాండ్ పూరించడం, కంపెనీ అట్రిషన్ రేటును దృష్టిలో పెట్టుకుని ఈ నియమకాలు చేయాలని నిర్ణయించినట్టు ప్రవీణ్ చెప్పారు.
సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్ లో ఉద్యోగుల అట్రిషన్ రేటు 20.1గా ఉంది. ఇది గత ఏడాది కేవలం 12.8 శాతంగా ఉంది. సెప్టెంబరు చివరి నాటికి కంపెనీలో 2,79,617 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్- 19 మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ రంగంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నట్టు కంపెనీ సీఓఓ తెలిపారు.
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అవకాశాలు అందిపుచ్చుకుని 2022 మార్చి నాటికి 16.5 శాతం నుంచి 17.5 శాతం ఆదాయం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జులైలో 14 నుంచి 16 శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేయగా అంతకన్నా వేగంగా కంపెనీ వృద్ధి సాధిస్తోంది.
సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్ లో కంపెనీ రూ.5,274 కోట్లు నికరలాభం సాధిస్తుందని అంచనా వేయగా, అంచనాలకు మించి గడచిన త్రైమాసికంలో రూ.5,421 కోట్ల లాభాలు ఆర్జించింది.ఇక ఆపరేషన్స్ రెవెన్యూ ఏకంగా 20.5 శాతం వృద్ధితో రూ.29,602 కోట్లు నమోదు చేసింది.
కంపెనీ షేర్ హోల్డర్లకు 2022 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్ గా ఒక్కో షేరుకు రూ.15 ప్రకటించారు. మా మెరుగైన పనితీరు, వృద్ధి అంచనాలు, వ్యూహాల అమలుకు మేము ఇస్తున్న ప్రాధాన్యం, డిజిటల్ రంగంలో రాణిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని సీఈఓ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు డిజిటలీకరణకు మారడం మార్కెట్లో మంచి అవకాశాలను కల్పిస్తోందని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ ప్రకటించారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.