ఉద్యోగాల (Jobs)కు సంబంధించిన వివిధ అంశాలపై అనేక సంస్థలు సర్వే చేపడుతుంటాయి. రిక్రూట్మెంట్ (Recruitment) సమయంలో అభ్యర్థుల నుంచి రిక్రూటర్స్ ఏం ఆశిస్తున్నారు, అభ్యర్థుల్లో ఎలాంటి స్కిల్స్ (Skills) ఉండాలి తదితర విషయాలపై లెటెస్ట్ ట్రెండ్స్‌ను సర్వేల ద్వారా వెల్లడిస్తుంటాయి. తాజాగా హైరెక్ట్ ఇండియా అనే జాబ్ పోర్టల్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. 2022లో 57 శాతం జాబ్ పొజిషన్స్‌కు బలమైన కమ్యూనికేషన్, సేల్స్ స్కిల్స్ అవసరం ఉందని సర్వే రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం సాఫ్ట్ స్కిల్‌కు రిక్రూటర్స్ తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, కేవలం 4శాతం కంటే తక్కువ రిక్రూటర్లు ఈ స్కిల్ ఉన్న అభ్యర్థుల కోసం చూస్తున్నారని నివేదిక పేర్కొంది.
సర్వే ప్రకారం.. రిక్రూట్మెంట్ సమయంలో అభ్యర్థులకు సెల్లింగ్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై మంచి పట్టు ఉండాలని రిక్రూటర్స్ ఆశిస్తున్నారు. సంస్థలు తమ మిడిల్-లెవల్ మేనేజ్మెంట్ను విస్తరించడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి సేల్స్ ఫోర్స్‌ను బిల్ట్ అప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని సర్వే పేర్కొంది. దీంతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగార్ధులకు డిమాండ్ ఎక్కువగా ఏర్పడింది.
స్టడీ ద్వారా డేటా సేకరణ
ఈ ఏడాది సంస్థలు, రిక్రూటర్స్ ఎక్కువగా ఆశించిన సాఫ్ట్ స్కిల్ అవసరాలను గుర్తించడానికి హైరెక్ట్ ఇండియా రీసెర్చ్ చేసింది. అత్యధిక డిమాండ్ ఉన్న సాఫ్ట్ స్కిల్స్‌ను గుర్తించడానికి ఒక అధ్యయనం చేపట్టింది. ప్రస్తుతం జాబ్ సీకర్స్ స్కిల్స్, రిక్రూటర్స్ అశిస్తున్న స్కిల్స్ మధ్య గ్యాప్ ను గుర్తించడానికి 2.5 లక్షలకు పైగా యాక్టివ్ జాబ్ లిస్టింగ్స్ నుంచి, 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది జాబ్ సీకర్స్ నుంచి డేటాను స్వీకరించింది. ప్రస్తుత పరిశ్రమలో హైరింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనే వివరాలను సర్వే వెల్లడించింది.
ట్రెండ్స్ అర్థం చేసుకోవడానికి
ఉద్యోగార్ధులకు ఇటీవలి ట్రెండ్స్, స్పెషల్ సాఫ్ట్ స్కిల్స్ డిమాండ్‌లో మార్పుల గురించి సర్వే అవగాహన కల్పిస్తుందన్నారు హైరెక్ట్ ఇండియా గ్లోబల్ కో-ఫౌండర్ రాజ్ దాస్. ఉద్యోగార్ధులకు ఉన్న నైపుణ్యాలు, ఇండస్ట్రీ డిమాండ్ స్కిల్స్ మధ్య ఉన్న అసమానతలను అర్థం చేసుకోవడానికి ఈ రిపోర్ట్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. సంస్థలు తమ వర్క్‌ఫోర్స్‌లో ఏ సాఫ్ట్ స్కిల్స్‌కు ప్రాధాన్యతనిస్తాయో గుర్తించడంలో ఈ సర్వే ఉపయోగపడిందన్నారు.
ఇది కూడా చదవండి : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ జీకే ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగలరేమో చూడండి..
ఈ స్కిల్స్ తప్పనిసరి..
సాధారణంగా జాబ్ సీకర్స్లో ఉండాల్సిన సాఫ్ట్ స్కిల్స్ ఏవో కూడా ఈ సర్వే సూచించింది. ప్రధానంగా కమ్యూనికేషన్, లీడర్షిప్, రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, సేల్స్, ప్రాబ్లమ్-సాల్వ్ వంటి స్టాఫ్ట్ స్కిల్స్ అభ్యర్థులకు తప్పనిసరి అని, ఇవి ఉంటే ఈజీగా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుందని సర్వే పేర్కొంది. సేల్స్ రంగంలో సాఫ్ట్ స్కిల్‌గా ఇప్పటికే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. దీంతో రిక్రూటర్స్ రిక్రూట్మెంట్ సమయంలో టీమ్ హ్యాండ్లింగ్, ఇంటర్న్‌ల్ స్కిల్స్ వంటివి బాగా ఉన్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని సర్వే పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Private Jobs