విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏఐసీటీఈ కీలక నిర్ణయం..

దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

news18-telugu
Updated: July 10, 2020, 6:27 AM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏఐసీటీఈ కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏఐసీటీఈ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నిరుద్యోగ సమస్య యువతను తీవ్రంగా వేధిస్తోంది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి పలు రకాల ఉన్నత కోర్సులు చేసినా.. ఉపాధికి గ్యారెంటీ ఉండట్లేదు. చాలామంది చదివిన చదువుకు చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోతోంది. దీంతో ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

ఈ కోర్సులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో ఏఐసీటీఈ సైతం ఆమోదం తెలిపింది. వీటితో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు-మెషిన్ లెర్నింగ్, మెకానికల్‌లో రోబోటిక్ కోర్సులకు సైతం ఆమోదముద్ర వేసింది. మూస ధోరణిలో సాగుతున్న కొన్ని కోర్సులకు భిన్నంగా ఇలాంటి కోర్సులకు చేయడం వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
Published by: Narsimha Badhini
First published: July 10, 2020, 6:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading