తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గతవారమే రిజల్ట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఇంటర్ విద్యార్థుల ఆలోచన అంతా ఒక్కటే. తర్వాత ఏం చదవాలి... కెరీర్లో ఎటు అడుగులు వేయాలి అన్న ధ్యాసే. ఇంటర్ తర్వాత చేయడానికి చాలా కోర్సులున్నాయి. సంప్రదాయంగా ఉండే కోర్సులతో పాటు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కూడా పలు విద్యాసంస్థల్లో ఉన్నాయి. టెక్నాలజీ రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్. ఇంటర్ తర్వాతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కోర్సులు చేయొచ్చన్న విషయం చాలామందికి తెలియదు. ఇంటర్ మంచి మార్కులతో పాసైతే చాలు ఈ లేటెస్ట్ టెక్నాలజీ కోర్సుల్ని చేయొచ్చు. కెరీర్లో మిగతావారికన్నా చాలా ముందు ఉండొచ్చు.
Read this:
After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అంటే ఏంటీ?
సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందినదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మానవ మేధస్సును అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కంప్యూటర్ వ్యవస్థ పనిచేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఇలా చాలా అంశాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అల్జీమర్స్ లాంటి జబ్బుల్ని కూడా నయం చేయొచ్చని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు రోబోటిక్స్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకం. మరి ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కోర్సులు ఎన్ని రకాలుగా ఉన్నాయో, వాటిని అందిస్తున్న విద్యాసంస్థలేవో తెలుసుకోండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కోర్సులు అందిస్తున్న విద్యాసంస్థలివే...
1. ఐఐఐటీ హైదరాబాద్, అలాహాబాద్
2. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
3. ఐఐటీ ఖరగ్‌పూర్
4. ఐఐఎస్సీ బెంగళూరు
5. ఐఐటీ బాంబే
6. ఐఐటీ మద్రాస్
Read this:
ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్
ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కోర్సులు ఇవే...
1. అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్
2. మెషీన్ లెర్నింగ్(ఇంటర్మీడియట్ లెవెల్)
3. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(ఏఐ, మెషీన్ లెర్నింగ్)
4. బీటెక్ సీఎస్ లేదా ఐటీ/ఈసీఈ/ఎంఈ/ఐఎన్/ఎంఎస్సీ
5. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ
6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటెక్
7. రోబోటిక్స్‌లో ఎంటెక్
10+2 పాసైనవాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన తర్వాత ఎంటెక్ చేయొచ్చు.
Photos: ఇస్తాంబుల్‌లో రూ.83,000 కోట్ల ఎయిర్పోర్ట్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఆర్ఆర్బీ
Aadhaar: ఆధార్‌లో అడ్రస్ మార్చేందుకు ఆన్లైన్ ప్రాసెస్ ఇదే...
JIO DND Feature: జియో యాప్‌లో డీఎన్డీ ఫీచర్ ఇలా యాక్టివేట్ చేయాలి