• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • ARTIFICIAL INTELLIGENCE AI ENGINEER TO CYBER SECURITY SPECIALIST IT COMPANIES GIVING JOB OPPORTUNITIES TO THESE 10 IT ROLES SS

IT Jobs: ఈ 10 స్కిల్స్ ఉన్నవారికి గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థల్లో ఉద్యోగావకాశాలు

IT Jobs: ఈ 10 స్కిల్స్ ఉన్నవారికి గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థల్లో ఉద్యోగావకాశాలు (ప్రతీకాత్మక చిత్రం)

IT Jobs 2021 | సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? ఐటీ జాబ్ మీ కలా? అయితే ఈ 10 స్కిల్స్‌పై దృష్టి పెట్టండి.

  • Share this:
    గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు కోరుకుంటున్నారా? అయితే ఈ సంస్థ ఎలాంటివారికి జాబ్స్ ఇస్తుందో తెలుసుకొని ఆ కోర్సుల్ని చేస్తే ఉద్యోగావకాశాలు పెంచుకోవచ్చు. నాస్‌కామ్ లెక్కల ప్రకారం భారతదేశంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగానికి దేశ జీడీపీలో 8 శాతం వాటా ఉంది. 2020 లో 1,38,000 కొత్త ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో కూడా ఐటీ కంపెనీల్లో నియామకాలు పెరిగాయి. ఐటీ రంగంలో అనేక రకాల కోర్సులు చేసినవారికి ఉద్యోగావకాశాలు ఉంటాయి. అప్‌గ్రాడ్ సంస్థ నివేదిక ప్రకారం ఈ 10 రకాల నైపుణ్యాలు ఉన్నవారిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి ఐటీ సంస్థలు. మరి ఆ 10 నైపుణ్యాలు ఏవి? ఏఏ స్కిల్స్ పెంచుకోవాలి? తెలుసుకోండి.

    1. Data Scientists: అమెరికా తర్వాత డేటా సైంటిస్టులు లేదా డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్‌ని నియమించుకుంటున్న రెండో దేశం ఇండియా. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు డేటా సైంటిస్టులను నియమించుకుంటున్నాయి. డేటా సైంటిస్టులకు భారీ జీతాలు ఇస్తున్నాయి కంపెనీలు. మెషీన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, డేటా మోడలింగ్, పైథాన్, ఆర్, ఎస్ఏఎస్, ఎస్‌క్యూఎల్ లాంటి కోడింగ్ లాంగ్వేజెస్ డేటా సైంటిస్టులకు తెలిసి ఉండాలి. ఫ్రెషర్‌కి వార్షికంగా రూ.5,00,000 నుంచి ప్యాకేజీ మొదలవుతుంది.

    2. Big Data Engineer: డేటా మైనింగ్‌పై దృష్టి పెడుతున్న కంపెనీలు ఇందుకోసం డేటా ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. గూగుల్, అమెజాన్, యాపిల్, ఊబెర్ లాంటి సంస్థలు డేటా ఇంజనీర్లను నియమిస్తున్నాయి. డేటా ఇంజనీర్ వార్షిక ప్యాకేజీ రూ.8,50,000 నుంచి మొదలవుతుంది.

    IBPS RRB 2021: రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 ఉద్యోగాలు... పరీక్ష సిలబస్ ఇదే

    Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డులో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    3. Cloud Architect: ఐటీ కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలపై దృష్టిపెడుతున్నాయి. ఇందుకోసం క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లను నియమిస్తున్నాయి. క్లౌడ్ ఆర్కిటెక్ట్ యాన్యువల్ ప్యాకేజీ రూ.16,00,000 నుంచి మొదలవుతుంది. మొక్రోసాఫ్ట్, యాక్సెంచర్, అమెజాన్, ఇంటెల్ లాంటి సంస్థల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి.

    4. Software Architect: సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ ఉద్యోగాలకూ మంచి డిమాండ్ ఉంది. ఇంటెల్, డెల్, ఫిలిప్స్ లాంటి సంస్థలు వీరిని నియమించుకుంటాయి. సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌కు విండోస్, లైనక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పాటు జావా స్క్రిప్ట్, సీ++, హెచ్‌టీఎంఎల్ లాంటి టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. సగటు యాన్యువల్ ప్యాకేజీ రూ.21,00,000.

    5. DevOps Engineer: డెవ్‌ఆప్స్ ఇంజనీర్‌కు యాపిల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ లాంటి సంస్థల్లో మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో వీరి సగటు ప్యాకేజీ రూ.6,70,000 ఉంటుంది.

    Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని ఆ రెండు జిల్లా అభ్యర్థులకు అవకాశం

    Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు... టెన్త్ పాస్ అయితే చాలు

    6. Full Stack Developer: పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్ లాంటి వాటితో పనిచేసే ఫుల్ స్టాక్ డెవలపర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. గూగుల్, ఐబీఎం, యాపిల్ లాంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. యాన్యువల్ ప్యాకేజీ రూ.6,00,000 ఉంటుంది.

    7. Artificial Intelligence (AI) Engineer: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఇంకొన్నేళ్ల పాటు ఢోకా లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ప్రారంభ వార్షిక వేతనం రూ.6,00,000 ఉంటుంది. అనుభవాన్ని బట్టి రూ.50,00,000 వరకు వేతనం పొందొచ్చు.

    8. Cyber Security Specialists: సైబర్ దాడులను ఎదుర్కోవడానికి సైబర్ నిపుణుల అవసరం ఎప్పటికీ ఉంటుంది. ఇండియాలో సైబర్ నిపుణుల సగటు వేతనం రూ.8,00,000 పైనే. గూగుల్, డెల్ లాంటి సంస్థలు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులను నియమించుకుంటున్నాయి.

    9. Blockchain Engineer: బ్లాక్‌చెయిన్ రంగం కూడా కొన్నేళ్లుగా విస్తరిస్తోంది. వీరికి సీ, సీ++, జావా, పైథాన్ లాంటి లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి. వార్షికంగా రూ.5,00,000 నుంచి రూ.30,00,000 వరకు వేతనం పొందొచ్చు.

    10. Internet-of-Things (IOT) Solutions Architect: ఏదైనా సంస్థకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా పరిష్కారాలను సూచించేందుకు ఐఓటీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అవసరం ఉంటుంది. వీరికి ప్రారంభ వేతనం రూ.3,50,000 ఉంటుంది. విప్రో, ఇంటెల్ లాంటి సంస్థలు వీరిని నియమించుకుంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published: