Army Jobs: ఆర్మీ జాబ్ కావాలా? కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Army Recruitment Rally 2019 | గతంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో 900 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. వారికి ఆర్మీలో ఉద్యోగాలు వచ్చాయి.

news18-telugu
Updated: August 9, 2019, 4:25 PM IST
Army Jobs: ఆర్మీ జాబ్ కావాలా? కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Army Jobs: ఆర్మీ జాబ్ కావాలా? కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 9, 2019, 4:25 PM IST
ఆర్మీలో ఉద్యోగం చేయడం మీ కలా? ఎలాగైనా ఆర్మీలో జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? అవకాశం వచ్చేసింది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు కరీంనగర్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరు కావచ్చు. అంతకంటే ముందు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే తేదీ, సమయం అడ్మిట్ కార్డుపైన ఉంటుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు దరఖాస్తు ఫామ్, అవసరమైన డాక్యుమెంట్లు ర్యాలీ జరిగే ప్రాంతానికి తీసుకురావాలి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Army Recruitment Rally 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 23

దరఖాస్తు ముగింపు: 2019 సెప్టెంబర్ 22
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2019 సెప్టెంబర్ 23 తర్వాత
రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీలు: అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు


Army Recruitment Rally 2019: పోస్టుల వివరాలు ఇవే...

Loading...
సోల్జర్ టెక్నికల్
సోల్జర్ టెక్నికల్-యానిమేషన్ / ఆమ్యూషన్ ఎగ్జామినర్
సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్
సోల్జర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్
సోల్జర్ జనరల్ డ్యూటీ
సోల్జర్ ఫార్మా
సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్

గతంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో 900 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. వారికి ఆర్మీలో ఉద్యోగాలు వచ్చాయి. ఈసారి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారన్న విషయంపై స్పష్టత లేదు. ఆర్మీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే వారి మాటలు నమ్మొద్దని, నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ హెచ్చరిస్తోంది.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

NTPC Jobs: ఇంజనీరింగ్ చదివారా? ఎన్‌టీపీసీలో 203 ఖాళీలు
First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...