Army Jobs: కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Army Recruitment Rally 2019 | ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే తేదీ, సమయం అడ్మిట్ కార్డుపైన ఉంటుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు దరఖాస్తు ఫామ్, అవసరమైన డాక్యుమెంట్లు ర్యాలీ జరిగే ప్రాంతానికి తీసుకురావాలి.

news18-telugu
Updated: September 20, 2019, 11:18 AM IST
Army Jobs: కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Army Jobs: కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 20, 2019, 11:18 AM IST
ఇండియన్ ఆర్మీ దేశవ్యాప్తంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా  అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది.  ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు సెప్టెంబర్ 22 చివరి తేదీ. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే తేదీ, సమయం అడ్మిట్ కార్డుపైన ఉంటుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు దరఖాస్తు ఫామ్, అవసరమైన డాక్యుమెంట్లు ర్యాలీ జరిగే ప్రాంతానికి తీసుకురావాలి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా? మీరు ఈ తప్పులు చేయొద్దు

Army Recruitment Rally 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...



దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 23
దరఖాస్తు ముగింపు: 2019 సెప్టెంబర్ 22


అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2019 సెప్టెంబర్ 23 తర్వాత
రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీలు: అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు
Loading...

Army Recruitment Rally 2019: పోస్టుల వివరాలు ఇవే...


సోల్జర్ టెక్నికల్
సోల్జర్ టెక్నికల్-యానిమేషన్ / ఆమ్యూషన్ ఎగ్జామినర్
సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్
సోల్జర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్
సోల్జర్ జనరల్ డ్యూటీ
సోల్జర్ ఫార్మా
సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్

గతంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో 900 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. వారికి ఆర్మీలో ఉద్యోగాలు వచ్చాయి. ఈసారి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారన్న విషయంపై స్పష్టత లేదు. ఆర్మీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే వారి మాటలు నమ్మొద్దని, నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ హెచ్చరిస్తోంది.

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి

RITES Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

 
First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...