Home /News /jobs /

ARMY PUBLIC SCHOOL SECUNDERABAD INVITING FOR TEACHER JOB VACANCIES JAN 15 IS LAST DATE FOR APPLICATIONS NS

Army Public School Jobs: సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Army Public School) పలు టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Teacher Jobs Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు జనవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన సికింద్రాబాద్ (Secunderabad) లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Army Public School) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 52 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది.

    ఖాళీలు..
































    పోస్టుఖాళీలు
    పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT)06
    ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT17
    ప్రైమరీ టీచర్స్ PRT25
    ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ PTI2
    PRT (మ్యూజిక్ వెస్ట్రన్, డ్యాన్స్)2
    మొత్తం52

    Job Mela in AP: ఏపీలో మరో జాబ్ మేళా.. BTech, MTech, BSc, MSc చేసిన వారికి జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

    విద్యార్హతల వివరాలు..
    పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT): సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కెమెస్ట్రీ, బయోలజీ, ఫిసికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, కామర్స్, జియోగ్రఫీలో ఖాళీలు ఉన్నాయి.
    ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT: సోషల్ సైన్స్ లో మూడు, ఇంగ్లిష్-4, పీటీఐ-1, హిందీ-4, Sanskrit 2, మాథ్స్-2 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    పీఆర్టీ: ప్రైమరీ క్లాసెస్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించడానికి 25 మంది టీచర్ల ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ/డీ.ఈ.ఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయాల్సి ఉంటుంది.
    ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ట్రక్టర్ (PRT): ఫిజికల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    వయస్సు: అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి. ఐదేళ్లలోపు అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    AP Jobs: ఏపీలో కరోనా.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేయండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం హోం పేజీలో vacancies లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3:  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఉంటాయి. ఆ వివరాలను పూర్తిగా చదివిన అనంతరం APPLICATION FORM ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


    Step 4: అనంతరం మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో సూచించిన వివరాలను పూర్తిగా నింపాలి.
    Step 5: ఆ ఫామ్ ను Army Public School, RK Puram, Secunderabad చిరునామాకు జనవరి 15లోగా పంపించాల్సి ఉంటుంది.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, Private teachers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు