ARMY PUBLIC SCHOOL JOBS TEACHER JOBS IN BOLLARAM ARMY PUBLIC SCHOOL CHANCE FOR THOSE WHO HAVE DONE DEGREE PG APPLY LIKE EVK
Army Public School Jobs: బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ జాబ్స్.. డిగ్రీ, పీజీ చేసిన వారికి ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్లోని (Army Public School) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్లోని (Army Public School) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 41 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 25, 2022ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
ఖాళీలు..
పోస్టు
ఖాళీలు
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT)
15
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT
20
ప్రైమరీ టీచర్స్ PRT
06
మొత్తం
41
విద్యార్హతల వివరాలు.. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT): సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కెఇంగ్లీష్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైకాలజీ లో ఖాళీలు ఉన్నాయి.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT: హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్ లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
పీఆర్టీ: ప్రైమరీ క్లాసెస్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించడానికి 25 మంది టీచర్ల ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ/డీ.ఈ.ఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం హోం పేజీలో vacancies లింక్ పై క్లిక్ చేయాలి. Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఉంటాయి. ఆ వివరాలను పూర్తిగా చదివిన అనంతరం APPLICATION FORM ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: అనంతరం మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో సూచించిన వివరాలను పూర్తిగా నింపాలి.
Step 5: ఆ ఫామ్ ను ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ - 500087 చిరునామాకు మే 25, 2022 లోగా పంపించాల్సి ఉంటుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.