సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ (CRC) AOC సికింద్రాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ AOC సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ 2022 నోటిఫికేషన్ ద్వారా మెటీరియల్ అసిస్టెంట్ (MA) పోస్టులను భర్తీ చేయనుంది. మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 419 ఖాళీగా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 23/10/2022
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 12/11/2022
దరఖాస్తు ఫీజు..
UR / OBC / EWS: రూ: 100
SC / ST / స్త్రీ: ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
వయోపరిమితి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
అర్హత
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదాఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో మెటీరియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఖాళీల వివరాలు
ప్రాంతం | రాష్ట్రం / UT | పోస్ట్ సంఖ్య |
తూర్పు | అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్, మణిపూర్ | 10 |
వెస్టర్న్ | ఢిల్లీ, పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ , హర్యానా | 120 |
ఉత్తర | జమ్మూ & కాశ్మీర్, లడఖ్ | 23 |
దక్షిణ | మహారాష్ట్ర, తెలంగాణ , తమిళనాడు | 32 |
నైరుతి | రాజస్థాన్, గుజరాత్ | 23 |
సెంట్రల్ వెస్ట్ | మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ | 185 |
సెంట్రల్ ఈస్ట్ | పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, సిక్కిం | 26 |
కేటగిరీల వారీగా ఇలా..
కేటగిరి | పోస్టులు |
UR | 171 |
EWS | 42 |
OBC | 113 |
ఎస్సీ | 62 |
ST | 31 |
మొత్తం | 419 |
ఎంపిక ప్రక్రియ
పరీక్ష పేపర్ లో ఆబ్జెక్టివ్ టైప్-మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్ మరియు హిందీలో సెట్ చేయబడతాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలలో నిర్వహించబడుతుంది. OMR షీట్లలో సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. రాత పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ (ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు) ఉంటుంది.
నోటిఫికేషన్ పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Secunderabad, Telangana, Telangana government jobs