Online Class: మీ పిల్లలు ఆన్‌లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న యూనిసెఫ్

Online Class: మీ పిల్లలు ఆన్‌లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న యూనిసెఫ్ (ప్రతీకాత్మక చిత్రం)

Online Class | మీ పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారా? అయితే జాగ్రత్త. ఈ జాగ్రత్తలు పాటించాలని యూనిసెఫ్ హెచ్చరిస్తోంది.

  • Share this:
కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టకపోవడం వల్ల ఇప్పట్లో పాఠశాలలు తెరిచే సూచనలు కనిపించడం లేదు. దీంతో విద్యార్థులకు ఇంకొంతకాలం ఆన్‌లైన్ తరగతులు తప్పేట్టు లేదు. అయితే ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకునే పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచీచెడుల గురించి తెలియజేసే విషయాలను పాఠ్యాంశాలుగా ఆన్‌లైన్ అభ్యాసంలో చేర్చాలని సూచిస్తున్నారు. పిల్లల భద్రతకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. పిల్లల సైబర్ సేఫ్టీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని యునిసెఫ్ కూడా చెబుతోంది. ఆన్​లైన్​ మాధ్యమాలను ఉపయోగించుకొని విద్యార్థులపై కొంతమంది దుర్మార్గులులైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యునిసెఫ్ చెప్పుకొచ్చింది.

పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా విద్యార్థులపై ఈ ప్రభావం పడుతోందని యునిసెఫ్ తెలిపింది. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించేందుకు ఇండియన్ టీచర్లు కూడా కృషి చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల సేఫ్టీపై శ్రద్ధ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పేరెంటల్ కంట్రోల్ ప్రైవసీతో సురక్షితమైన వైఫై నెట్‌వర్క్ ద్వారా పిల్లలను అనుమానాస్పద సైట్‌ల నుంచి కాపాడుతున్నారు. ఆన్‌లైన్‌ వేధింపులు నుంచి పిల్లలను రక్షించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు అప్లై చేసినవారికి అలర్ట్... ఆ జాబ్ నోటిఫికేషన్ నిలిపివేసిన ఇండియా పోస్ట్

Jobs Hiring: ఈ రంగాల్లో మీకు నైపుణ్యం ఉందా? ఉద్యోగాల జాతర మొదలైంది

అయితే, అత్యంత సురక్షితమైన వెబ్ సైట్‌లలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి సైబర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల ఆన్‌లైన్ తరగతుల విషయంలో మరిన్నిజాగ్రత్త తీసుకోవాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్నికోరుతున్నారు. కేవలం తమ పాఠశాల విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్ క్లాస్లో జాయిన్ అయ్యేలా స్వంత ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని పాఠశాల యాజమాన్యాలకుతల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RRB Group D Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 1,03,769 రైల్వే ఉద్యోగాలకు త్వరలో ఎగ్జామ్

Railway Jobs: భారతీయ రైల్వేలో 1664 జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి నేర్పించినట్లు మంచి డిజిటల్ అలవాట్లను కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని ఇంటర్‌వీవ్ కన్సల్టింగ్ సీఈఓ నిర్మలా మీనన్ అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ టెక్స్టింగ్, సంభాషణలలోనే కాకుండా ప్రతి విషయంలోనూ ఏది మంచో ఏది చెడో.. గుర్తించేలా పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తద్వారా తోటి విద్యార్థులు, సిబ్బంది లేదా అధ్యాపకులు సరిహద్దులు దాటలేరని నిర్మలా మీనన్ చెప్పుకొచ్చారు.

ఇక, ఇదే విషయంపైక్లయ్ ప్రీస్కూల్స్, డేకేర్‌లో ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ మేఘనా యాదవ్ మాట్లాడుతూ ‘‘విద్యార్థులు ఇంటర్నెట్ సేఫ్టీ గురించి ట్రైనింగ్ తీసుకోవాలి.డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టిన వెంటనే చిన్న పిల్లలకు మంచి, చెడు విషయాలను తెలియచేసే శిక్షణ ప్రారంభించాలి.డిజిటల్ లైఫ్ లో చోటు చేసుకునే నేరాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది.”అని ఆమె పేర్కొన్నారు.దీనివల్ల పిల్లలు జాగ్రత్త పడతారని ఆమె చెప్పుకొచ్చారు.
Published by:Santhosh Kumar S
First published: