హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CAT 2022: క్యాట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ ప్రిపరేషన్ టిప్స్ మీకోసం..

CAT 2022: క్యాట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ ప్రిపరేషన్ టిప్స్ మీకోసం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CAT 2022: క్యాట్ ఎగ్జామ్‌కు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ఎంతో పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో అభ్యర్థులకు గత సంవత్సరాల టాపర్స్ ఇస్తున్న టిప్స్, వారి ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని టాప్ బిజినెస్ స్కూల్స్‌ (Business Schools)లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 27న పరీక్ష జరగనుంది. పరీక్షకు రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ఎంతో పకడ్బందీగా ప్రిపేర్ (Exam Preparation) అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో అభ్యర్థులకు గత సంవత్సరాల టాపర్స్ ఇస్తున్న టిప్స్, వారి ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలుసుకుందాం.

* కచ్చితత్వంపై దృష్టిసారించాలి..

ముంబైకి విద్యార్థి నీలే జైన్ క్యాట్-2021లో 99.98 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. తన ప్రిపరేషన్ అనుభవాలను ఇలా పంచుకున్నాడు. క్యాట్‌లో టాప్ స్కోర్ కోసం ప్రతి ప్రశ్నను సాల్వ్ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాకపోవచ్చని అతడు చెప్పాడు. ఒక అభ్యర్థి 60-70 శాతం ప్రశ్నలను మాత్రమే పర్పెక్ట్‌గా సాల్వ్ చేయవచ్చు కాబట్టి ప్రతి అభ్యర్థి పర్పెక్షన్‌పై దృష్టిసారించాలని సూచించాడు.

* డైలీ మాక్ టెస్ట్ ప్రాక్టీస్..

ముంబైకి చెందిన మరో విద్యార్థి చిరాగ్ గుప్తా క్యాట్ -2021లో 100 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. క్యాట్ పరీక్ష కోసం సొంతంగా ప్రిపేర్ అయ్యానని చెప్పాడు. ప్రారంభంలో వారానికి ఒక మాక్ టెస్ట్‌ రాశానని, కొన్ని రోజుల తరువాత ప్రతిరోజూ కనీసం ఒక మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. ప్రిపరేషన్ కోసం రోజుకు ఐదు గంటల సమయం కేటాయించినట్లు తెలిపాడు. ప్రిపరేషన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి స్ఫెల్ స్టడీతో పాటు ఎక్కువగా మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయినట్లు చిరాగ్ చెప్పుకొచ్చాడు.

క్యాట్-2021లో 99.99 పర్సంటైల్ స్కోర్ చేసిన అహ్మదాబాద్‌ విద్యార్థి విరాజ్ షా కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు. మాక్ టెస్ట్‌లతో పాటు స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి స్కోర్ చేసినట్లు చెప్పాడు. గ్రూప్ స్టడీలో.. టైమ్ మేనేజ్‌మెంట్, పేపర్లను ఎంత వేగంగా సాల్వ్ చేయాల్లో డిస్కషన్స్ చేసి, క్యాట్ ప్రిపరేషన్, స్టడీ స్పీడ్‌ను పెంచుకున్నానని విరాజ్ వివరించాడు.

*గ్రూప్ స్టడీతో టాప్ స్కోర్..

సాధారణంగా గ్రూప్ స్టడీ‌తో ఏకాగ్రతగా చదవలేమని చాలా మంది విద్యార్థులు చెబుతుంటారు. అయితే ఐఐటీ గాంధీ నగర్‌కు చెందిన విరాజ్ షా, హర్షిత్ కుమార్, ధనేష్ భూతాడ ఒక గ్రూప్‌గా ఏర్పడి దాదాపు ఆరు నెలల పాటు సంయుక్తంగా ఎగ్జామ్‌కు సిద్ధమయ్యారు. వీరందరూ క్యాట్-2021లో 99.99 పర్సంటైల్ స్కోర్ సాధించడం గమనార్హం. క్యాట్‌లో వేగం, కచ్చితత్వంతో ప్రశ్నలను సాల్వ్ చేయడానికి రెండు నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్ చాలా కీలకమని, అందుకు తగ్గట్టు రోజుకు 2-3 గంటలు స్టడీ చేసి, 90 - 100 ప్రశ్నలను సాల్వ్ చేశానని ధనేష్ చెప్పాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Cat, EDUCATION, Exam Tips, JOBS

ఉత్తమ కథలు