హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Books: సివిల్స్ కోసం ఏది దొరికితే అవి చదువుతున్నారా ? అలా వద్దు.. ఈ బుక్స్ చదివితే చాలు మీరు అనుకున్నది సాధించినట్లే!

UPSC Books: సివిల్స్ కోసం ఏది దొరికితే అవి చదువుతున్నారా ? అలా వద్దు.. ఈ బుక్స్ చదివితే చాలు మీరు అనుకున్నది సాధించినట్లే!

  సివిల్స్ కోసం ఏది  దొరికితే అవి చదువుతున్నారా ? అలా వద్దు.. ఈ బుక్స్ చదివితే చాలు మీరు అనుకున్నది సాధించినట్లే!

సివిల్స్ కోసం ఏది దొరికితే అవి చదువుతున్నారా ? అలా వద్దు.. ఈ బుక్స్ చదివితే చాలు మీరు అనుకున్నది సాధించినట్లే!

సెప్టెంబర్ 16న UPSC (IAS) మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షలో బెస్ట్ స్కోర్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన బుక్స్ (Books)ఏవో తెలుసుకుందాం.

భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈ పరీక్ష(Exam)లో విజయం సాధించాలంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదు. ఇందుకు ప్లానింగ్ ముఖ్యం. ప్రిపరేషన్‌కు తగ్గ ఫలితాలు సాధించాలంటే బెస్ట్ స్టడీ మెటీరియల్ ఫాలో అవ్వాలి. సెప్టెంబర్ 16న UPSC (IAS) మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షలో బెస్ట్ స్కోర్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన బుక్స్ ఏవో తెలుసుకుందాం.

ఇండియన్ ఎకానమీ- శ్రీరామ్స్ IAS

పియర్సన్ పబ్లిషింగ్ హౌస్ 2019లో మొదటిసారిగా శ్రీరామ్స్ IAS ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్‌ను ప్రచురించింది. ఎకానమీకి సంబంధించిన బెస్ట్ సెల్లర్ ఇది. గత నెలలో విడుదలైన రెండో ఎడిషన్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 850. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలలో చాలా ప్రశ్నలు దీని నుంచి వచ్చాయి.

ఇండియన్ పాలిటీ- లక్ష్మీకాంత్

M లక్ష్మీకాంత్ రచించిన ఇండియన్ పాలిటీ బుక్‌కు ఎలాంటి పరిచయం అవసరం లేదు. పాలిటీ బుక్స్‌లో ఇదే బుక్(Books) అనేక సంవత్సరాలుగా టాప్ ప్లేస్‌లో ఉంటోంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు, ముఖ్యంగా CSE అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన పాలిటీ బుక్ ఇది.

ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్- నితిన్ సింఘానియా

నితిన్ సింఘానియా రచించిన ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బుక్.. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ విభాగాన్ని కవర్ చేస్తుంది. రచయిత అనేక పిక్చర్స్, డయాగ్రామ్స్ సహాయంతో ఇండియన్ ఆర్ట్స్, పెయింటింగ్స్, మ్యూజిక్, ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన విస్తృత సమాచారాన్ని ఈ పుస్తకంలో అందించారు. విద్యార్థులు పరీక్షకు సిద్ధం కావడానికి సహాయపడే క్వశ్చన్స్ కూడా ఇచ్చారు.

 ఇంటర్నేషనల్ రిలేషన్స్- పుష్పేష్ పంత్

ఈ UPSC బుక్‌ అన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌ వివరాలను కవర్ చేస్తుంది. ఏదైనా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ ఈ బుక్‌ను ఇష్టపడతారు. రచయిత పుష్పేష్ పంత్ పద్మశ్రీ గ్రహీత. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో లెక్చరర్‌గా పదవీ విరమణ చేసిన విద్యావేత్త, చరిత్రకారుడు.

ఆక్స్‌ఫర్డ్ స్కూల్ అట్లాస్ (జాగ్రఫీ)- ఆక్స్‌ఫర్డ్ పబ్లిషర్స్

ఆక్స్‌ఫర్డ్ స్కూల్ అట్లాస్‌లో విద్యార్థులకు సమగ్ర సమాచాన్ని అందించే 200 చార్ట్స్‌ ఉన్నాయి. 94 థీమాటిక్ ఇండియన్ మ్యాప్స్‌తో వీటిని అట్లాస్‌లో అందించారు. ఇండియన్ ఫిజికల్, పొలిటికల్ మ్యాప్స్, ఇన్ఫర్మేటివ్ ప్రిలిమినరీ పేజీలు, వాతావరణం, వన్యప్రాణులు, సహజ వృక్షసంపద, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, జనాభా, పర్యావరణ సమస్యలు వంటి టాపిక్స్‌కు స్పెషల్ సెక్షన్స్, డేటా ఉన్నాయి.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

కరెంట్ ఎఫైర్స్- ఇండియా ఇయర్‌బుక్

భారత ప్రభుత్వ ప్రచురణ విభాగం ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తుంది. దేశంలోని కరెంట్ ఎఫైర్స్ గురించి పూర్తి సమాచారం, కీలకమైన వ్యక్తులు, ప్రముఖులు, రాష్ట్ర విధానం, ప్రజా పథకాలు, జనాభా, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, ఇతర విషయాల గురించి ప్రమాణిక డేటా ఉంటుంది.

బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా- రాజీవ్ అహిర్

రాజీవ్ అహిర్ రచించిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా’లో మొఘల్ సామ్రాజ్యం పతనం, ఈస్టిండియా కంపెనీ పాలన, దేశంలో బ్రిటీష్ పాలన ప్రారంభమైన తర్వాత జరిగిన సంఘటనల గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947లో స్వాతంత్ర్యం సాధించడం వరకు అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు.

ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ – డాక్టర్ రవి అగ్రహరి

మెక్‌గ్రా హిల్ ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రధాన పర్యావరణ సమస్యలను వివరిస్తుంది. CSEలోని విపత్తు నిర్వహణ, సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇందులో అందించారు.

First published:

Tags: Career and Courses, JOBS, Study center, UPSC

ఉత్తమ కథలు