UPSC నిర్వహించే ఏ నియామక పరీక్ష అయినా.. కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ పరీక్షను ఛేదించడానికి ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు సిద్ధమవుతుంటారు. అయితే ఈ పరీక్షలో కొంతమంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తారు. UPSC పరీక్షను విజయవంగా పూర్తి చేయడానికి యువతకు ప్రత్యేక ప్రణాళిక మరియు ప్రిపరేషన్ అవసరం. ఆ తర్వాత మాత్రమే అభ్యర్థులు ఈ పరీక్షలో విజయం సాధించగలరు. అభ్యర్థులు యుపిఎస్‌సి(UPSC) పరీక్షలో సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తున్నాం. వాటి గురించి తెలుసుకోండి.
UPSC పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ పరీక్షకు మానసికంగా , శారీరకంగా సిద్ధంగా ఉండాలి. అప్పుడుతమ లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా,, తమ సమయాన్ని సమర్థవంతంగా కేటాయించడం ద్వారా పరీక్షకు సిద్ధపడాలి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే .. మీరు ఉద్యోగాన్ని వదిలివేయకూడదని నిర్ణయించుకున్నట్లయితే.. మీరు చదువుకోసం ఎంత సమయం కేటాయిస్తారో విశ్లేషించుకోండి. దాని కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోండి. అంతే కాకుండా.. అభ్యర్థులు ఇంటర్నెట్ తో కూడా మొబైల్ సహాయం తీసుకోవచ్చు. ఇంటర్నెట్ సహాయంతో.. మీరు మీ ప్రిపరేషన్ మరియు ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవచ్చు. అంతే కాకుండా.. అభ్యర్థి UPSC సిలబస్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
నోట్స్ అతిముఖ్యం..
సిలబస్ ఏదైనా పరీక్షకు అది ఎంతో ఉపయోగకరుంగా ఉంటుంది. సిలబస్ లో ఉన్న ప్రతీ అంశం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏ పుస్తకం అయినా చదివే ముందు.. సిలబస్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అభ్యర్థులు తప్పనిసరిగా UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష సిలబస్‌ను అర్థం చేసుకోవాలి. తదనుగుణంగా వారి ప్రిపరేషన్ కోసం స్టడీ మెటీరియల్‌ని ఎంచుకోవాలి. ఇది సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా మీకు సహాయపడుతుంది. ఒక్క UPSC పరీక్షే కాదు..గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఎంతో కీలకంగా ఉంటుంది. వాటి కోసం ప్రతీ రోజు వార్త పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు నోట్స్ తయారు చేసుకోవాలి.
మాక్ టెస్ట్‌లు ఎంతో ఉపయోగకరం..
అంతే కాకుండా.. అభ్యర్థులు ఎంత చదువుతున్నారో.. అంత కంటే ఎక్కువగా పున:చ్చరణ చేసుకోవాలి. దాని కోసం ప్రతీ రోజు మాక్ టెస్టు రాయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. UPSC పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గత సంవత్సరం ప్రశ్నపత్రాలను పరిష్కరించాలి. ఇలా చేయడం ద్వారా.. అభ్యర్థి పరీక్ష సరళిని అర్థం చేసుకుంటారు. అభ్యర్థులు గరిష్టంగా మాక్ టెస్ట్‌లు రాయాలి. చదివిన వాటిని కూడా రివైజ్ చేస్తూ ఉండాలి. పైన చెప్పిన టిట్స్ ఒక్క యూపీఎస్సీ కే కాకుండా.. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు.. పోటీ పరీక్ష ఏదైనా ఇవి ఎంతో ఉపయోకరంగా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Preparation tips, TSPSC, UPSC