హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022: నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా..? ఇంపార్టెంట్ బుక్స్, సబ్జెక్టు వైజ్ ఛాప్టర్లు ఏవో తెలుసుకోండి..

NEET 2022: నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా..? ఇంపార్టెంట్ బుక్స్, సబ్జెక్టు వైజ్ ఛాప్టర్లు ఏవో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ సిలబస్ (NEET Syllabus)లో 11, 12 తరగతులలో బోధించే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలోని టాపిక్స్ ఉంటాయి. ఈ మూడు సబ్జెక్టులలోని ప్రతి ఛాప్టర్ (Chapter) దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NEET) 2022 జూన్‌లో జరిగే అవకాశముంది. ఈ ఏడాది కూడా మెడికల్ ఎంట్రన్స్‌లో ఇంటర్నల్ కాలేజీలు ఉండే వెసులుబాటును గతేడాదిలాగే పొడిగించొచ్చని తెలుస్తోంది. అయితే టాప్ కాలేజీల్లో అడ్మిషన్లు (Medical Admissions) పొందాలంటే మెడికల్ అభ్యర్థులు హై కట్-ఆఫ్ మార్క్స్ (High Cut-off Marks) సాధించాల్సి ఉంటుంది. నీట్ సిలబస్ (NEET Syllabus)లో 11, 12 తరగతులలో బోధించే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలోని టాపిక్స్ ఉంటాయి. ఈ మూడు సబ్జెక్టులలోని ప్రతి ఛాప్టర్ (Chapter) దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. గత 8-10 ఏళ్ల క్వశ్చన్ పేపర్లను గమనిస్తే కొన్ని ఛాప్టర్లు మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం అర్థమవుతుంది. మరి ఆ ఛాప్టర్లు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్, సబ్జెక్ట్ వైజ్ ఛాప్టర్లు ఏవి? లాంటి విషయాలు చూద్దాం.

*ఇంపార్టెంట్ ఛాప్టర్లు

* ఫిజిక్స్

కైనమాటిక్స్ (Kinematics), ఎలెక్ట్రోస్టాటిక్స్ (Electrostatics), బల్క్ మ్యాటర్ ప్రాపర్టీస్ (Properties of Bulk Matter), ఆటమ్స్ అండ్ న్యూక్లిఐ (Atoms And Nuclei) ఛాప్టర్ల నుంచి యావరేజ్ గా ప్రతి ఇయర్ 3 లేదా 4 ప్రశ్నలు నీట్ ప్రశ్నాపత్రంలో అడుగుతారు. అలాగే కరెంటు ఎలక్ట్రిసిటీ (Current Electricity) నుంచి 4, ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి 3 ప్రశ్నలు ప్రతి ఏటా నీట్ క్వశ్చన్ పేపర్ లో కనిపిస్తాయి.

IIT Village : ఆ గ్రామంలో ఎక్కడ చూసినా ఐఐటీ విద్యార్థులే.. క్యూ కడుతున్న ఐఐటీయన్లు.. ఆ వివరాలిలా..


* ఫిజికల్ కెమిస్ట్రీ

సాలిడ్ స్టేట్ (Solid State), స్టేట్స్ ఆఫ్ మేటర్ (States Of Matter), ఎలక్ట్రోకెమిస్ట్రీ (Electrochemistry), సొల్యూషన్స్ (Solutions) కెమికల్ కైనటిక్స్ (Chemical Kinetics) ఛాప్టర్ల నుంచి యావరేజ్ గా ప్రతి ఇయర్ 2 ప్రశ్నలు నీట్ ప్రశ్నాపత్రంలో అడుగుతారు.

* ఇనార్గానిక్ కెమిస్ట్రీ (Inorganic Chemistry)

కెమికల్ బాండింగ్ (Chemical Bonding) నుంచి 5, పీ-బ్లాక్ (p-block) ఛాప్టర్ల నుంచి 3 ప్రశ్నలు ప్రతి నీట్ ఎగ్జామ్ పేపర్ లో కచ్చితంగా ఉంటాయి.

* ఆర్గానిక్ కెమిస్ట్రీ

హైడ్రో కార్బన్ నుంచి 4, కార్బనయిల్ కాంపౌండ్ మంచి 3 ప్రశ్నలు వస్తాయి.

* బయాలజీ

ప్లాంట్ కింగ్డమ్ 5... యానిమల్ కింగ్డమ్ 4... అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 3... స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ 3... బయో మాలిక్యూల్స్ 3... సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ 7... ఫొటో సింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ 4... ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 3... బ్రీతింగ్ అండ్ ఎక్స్ చేంజ్ గ్యాసెస్ 3... బాడీ ఫ్లూయిడ్ అండ్ సర్కులేషన్ 3.. లోకోమోషన్ అండ్ మూవ్‌మెంట్ 4... సెక్స్ వల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 3.. రీప్రొడక్టివ్ హెల్త్ 3... హ్యూమన్ రీ ప్రొడక్షన్ 3... మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్ హెరిటేన్స్ 10... హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ 3... స్ట్రాటజీస్ ఫర్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ 3.. బయోటెక్నాలజీ: ప్రిన్సిఫుల్స్ అండ్ ప్రాసెస్ 6... బయో టెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ 6... ఆర్గనిజమ్స్ అండ్ పాపులేషన్స్ 4... ఎకో సిస్టమ్ 3 ప్రశ్నలు యావరేజ్ గా నీట్ క్వశ్చన్ పేపర్ లో అడుగుతారు.

* నీట్ 2022: ఇంపార్టెంట్ బుక్స్

11, 12వ తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) బుక్స్ లో వివరించిన విధంగా ప్రతి టాపిక్ తో పాటు దాని వివరణను విద్యార్థులు క్షుణ్ణంగా చదువుకోవాలి. తర్వాత గత పదేళ్ల నీట్ క్వశ్చన్ పేపర్లను ఛాప్టర్ వారీగా ప్రాక్టీస్ చేయాలి.

* నీట్ 2022: ప్రిపరేషన్ స్ట్రాటజీకి కీ పాయింట్స్

- స్ట్రాంగ్ ఫౌండేషన్

నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు స్ట్రాంగ్ ఫౌండేషన్ ని ఏర్పరచుకోవడం, కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి.

- టార్గెట్ స్కోర్

బలం, బలహీనత ఆధారంగా టార్గెట్ స్కోర్‌ని మూడు సబ్జెక్టుల వారీగా విద్యార్థులు విభజించుకోవాలి.

TS TET 2022: టెట్ అభ్యర్థులకు షాకిస్తున్న వెబ్ సైట్.. ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో ట్విస్టులు.. వివరాలివే

- ప్యాట్రన్

నీట్ ప్రిపరేషన్‌కు ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవడం, కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడం రెండూ అవసరం. ఇందుకు అవసరమైన రెండు నైపుణ్యాలను మెరుగుపరచడానికి తగిన పద్ధతులను అనుసరించాలి. ఇంకా మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రోగ్రెస్ పై ఓ కన్నేసి ఉంచాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET 2022, Preparation, Students, Tips

ఉత్తమ కథలు