హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

School Assistant Preparation: స్కూల్ అసిస్టెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ బుక్స్ పై ఓ లుక్కేయండి..

School Assistant Preparation: స్కూల్ అసిస్టెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ బుక్స్ పై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలా రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే... అయితే విద్యాశాఖ నుంచే ఎక్కువ మొత్తంలో ఉద్యోగ ఖాళీలు వెలువడే అవకాశం ఉంది..  తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 లో మాత్రమే టీఆర్టీ వేసారు.. ఆనాటి నుంచి  నోటిఫికేషన్ రాలేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(P. Mahender, News 18, Nizamabad)

చాలా రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే విద్యాశాఖ నుంచే ఎక్కువ మొత్తంలో ఉద్యోగ ఖాళీలు వెలువడే అవకాశం ఉంది..  తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 లో మాత్రమే టీఆర్టీ(TRT) వేసారు.. ఆనాటి నుంచి  నోటిఫికేషన్ రాలేదు. అయితే  తెలంగాణలో సుమారు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది.. టిఆర్టీ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్(Notification) కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు..  అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని 16 సంవ‌త్సార‌ల అనుభ‌వం క‌లిగిని స్కూల్ అసిస్టేంట్  సిహెచ్ శ్రీద‌ర్ అంటున్నారు.

RRB Group D Update: రైల్వే గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ D పరీక్షలపై తాజా అప్ డేట్..


అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ను సద్వినియోగం చేసుకొవాలి.. ఉద్యోగం  సంపాదించుకునే దిశగా ప్రిపరేషన్ కావాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. ప్రిపరేషన్ అందరూ చేస్తారు.. కానీ మనం చేసే ప్రిపరేషన్తో 100కు 100 శాతం జాబ్ వచ్చే విధంగా కష్టపడాలి.. టిఆర్టి లో స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే మొత్తం వంద మార్కులు.. కంటెంట్ నుంచి 45 మార్కులు వ‌స్తాయి.. అలాగే మెథడాలజి  15 మార్కులు వస్తాయి.. జీకే క‌రెంట్ ఎఫేర్స్ నుంచి మ‌రో 20 మార్కులు వ‌స్తాయి.. మొత్తం 80 మార్కులు.. మ‌రో 20 మార్కులు టెట్ ర్యాంక్ ను బ‌ట్టి ఇస్తారు.. అయితే కంటెంట్ మూడో తరగతి నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు వరకు పూర్తిగా చదవాలి. ప్రశ్నాపత్రాన్ని ఒకసారి పరిశీలించినట్లుయితే డిగ్రీ వరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే.. తెలుగు అకాడమీ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్..  టెస్ట్ బుక్స్ కంప్లీట్ గా క్షుణంగా చ‌దివిన‌ తర్వాత మనం నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఇంటర్మీడియట్.. డిగ్రీ పుస్తకాలను కూడా అంటే స్కూల్ బుక్ లో ఉన్న అంశాల ఆధారంగా వాటిని బేరీజు వేసుకొని దానికి అనుగుణంగా కంటెంట్ ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు మెథడాలజీ అంటే బోధనా పద్ధతుల గురించి తెలుసుకోవాలి..  సాంఘిక శాస్త్రం బోధించే పద్ధతి మెథడాలజీ అనేది తెలుగు అకాడమీ వారు ఇచ్చినటువంటి బోధన పద్ధతులు పుస్తకాన్ని చదువుకోవాలి..  గతంలో వచ్చిన క్వశ్చన్ పేపర్లు చూసినట్లయితే వాటిలో ఎలాంటి  ప్ర‌శ్నాలు ఇస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోవాలి.

School Teachers: కేవలం ఆ పాఠాలు చెప్పడానికే టీచర్లు కావాలంట.. ట్విటర్‌లో హాట్ టాపిక్‌గా వ్యవహారం..!

ప్ర‌స్పేక్ట్ ఎడ్యుకేషన్ అనేది 10 మార్కులు ఉంటాయి. గతంలో ప్రశ్నాపత్రాల ఆధారంగా ఆ ప్రశ్నలను చ‌దువాలి.. జీకే విషయానికి వస్తే చాలావరకు విజేత.. ఉద్యోగ సోపానం వంటి మ్యాగ‌జైన్ చ‌దువాలి.. దీంతో జీకే వర్ధమాన విషయాల కోసం న్యూస్ పేపర్లు చదువుకుంటే మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు.. ప్రధాన‌ ఘటనను ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.. ఇలా చేస్తే ఈ 10 మార్కులు జీకే నుంచి ఈజీగా సాధించవ‌చ్చు.


Xiaomi Phones Price Cut : రాఖీ పండుగ, ఇండిపెండెంట్స్ డే సందర్భంగా.. Xiaomi ఫోన్లపై భారీ తగ్గింపులు..


ఎన్ని లక్షల మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ మన లక్ష్యం వైపు వెళ్లాలి. కంటెంట్ చదువుతూ ముఖ్యాంశాలను గమనించి నోట్స్ రూపంలో రాసుకుంటే మ‌ళ్లి చదవాల్సిన అవ‌స‌రం ఉండదు.. నోట్స్ చూసుకుంటే స‌రిపోతుంది.. గతంలో వచ్చినటువంటి మోడల్ పేపర్ ను కచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది.. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం మూలంగా మనం ఎంతవరకు చదివాము.. ఎంతవరకు సక్సెస్ ఫుల్ గా గుర్తుంచు కున్నామ‌నే విష‌యం తెలుస్తుంది.. దీంతో మన అభ్యాసాన్ని మరింత మెరుగుపరచుకునే అవకాశం ఉందిని స్కూల్ ఆసిస్టేంట్ శ్రీద‌ర్ చెప్పారు.

First published:

Tags: Career and Courses, JOBS, Private teachers, Teacher jobs, Telangana jobs

ఉత్తమ కథలు