Home /News /jobs /

ARE YOU PREPARING FOR JEE ADVANCED IF YOU FOLLOW THESE TIPS THE SEAT IS GUARANTEED UMG GH

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కు ప్రిపేర్ అవుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అయితే సీట్ గ్యారెంటీ !

 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కు ప్రిపేర్ అవుతున్నారా ? ఈ  టిప్స్ ఫాలో అయితే సీట్ గ్యారెంటీ !

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కు ప్రిపేర్ అవుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అయితే సీట్ గ్యారెంటీ !

జేఈఈ(JEE) అడ్వాన్స్‌డ్ పరీక్షకు 20 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. దీంతో ఐఐటీ(IIT)ల్లో అడ్మిషన్ టార్గెట్‌గా పెట్టుకున్న స్టూడెంట్స్ ప్రిపరేషన్(Preparation) స్టాండర్డ్స్ పెంచుతున్నారు. JEE అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌కు ప్రిపేరయ్యే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు సమానంగా టైమ్ కేటాయించడంతో పాటు సరైన టైమ్‌ టేబుల్‌తో ప్రిపరేషన్ కొనసాగించాలని కోచింగ్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced) పరీక్షకు 20 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. దీంతో ఐఐటీల్లో అడ్మిషన్ టార్గెట్‌గా పెట్టుకున్న స్టూడెంట్స్ ప్రిపరేషన్(Preparations) స్టాండర్డ్స్ పెంచుతున్నారు. JEE అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌కు ప్రిపేరయ్యే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు సమానంగా టైమ్(Time) కేటాయించడంతో పాటు సరైన టైమ్‌ టేబుల్‌తో ప్రిపరేషన్ కొనసాగించాలని కోచింగ్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. మాక్ టెస్ట్‌(Test)లు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలని సలహా ఇస్తున్నారు. విద్యార్థులు ప్రిపరేషన్ టైమ్‌లో తయారు చేసిన నోట్స్‌ను రివైజ్ చేసుకోవాలని, డౌట్స్ ఉంటే సంబంధిత సబ్జెక్ట్ టీచర్లను సంప్రదించి గైడెన్స్ తీసుకోవాలని చెబుతున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్‌లో వివిధ రకాల ప్రశ్నలు వస్తాయి. ఒకే సరైన సమాధానం లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్‌తో విద్యార్థులు తికమకపడవచ్చు. మ్యాట్రిక్స్ మ్యాచ్ రకం ప్రశ్నలు కాస్త కన్ఫ్యూజన్‌గా ఉండవచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. అందువల్ల డౌట్స్ ఉండే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. JEE అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ చేయడంలో సహాయపడే కొన్ని ముఖ్యమైన ప్రిపరేషన్ టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

స్టడీ షెడ్యూల్
విద్యార్థులు కచ్చితంగా ఒక టైమ్‌టేబుల్‌ ఫాలో అవ్వాలి. అన్ని సబ్జెక్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. JEE అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించడం అంత సులభం కాదు, కానీ హార్డ్‌ వర్క్‌తో పాటు నిబద్ధతతో, ప్లానింగ్‌ ప్రకారం ప్రిపేర్ అయితే.. సక్సెస్ మీ సొంతం అవుతుంది.

మాక్ టెస్టులు
ఎగ్జామ్ ప్యాటర్న్‌పై పూర్తి అవగాహన రావాలంటే మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఎలాంటి ప్రశ్నలు టైమ్ తీసుకుంటున్నాయి, ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు, ఎలాంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాలి..? వంటివన్నీ తెలుస్తాయి. ప్రిపరేషన్‌ ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోవడానికి విద్యార్థులు మాక్ టెస్ట్‌లు తప్పనిసరిగా రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి మాక్ టెస్ట్ తర్వాత ఎగ్జామ్‌ గురించి విశ్లేషణ చేయడం మంచిది.

టైమ్ మేనేజ్‌మెంట్
చాలా మంది విద్యార్థులు సరైన ప్లానింగ్, టైమ్ సెన్స్ లేకుండా ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుంటారు. ఈ విధానం సరికాదు. అదే పనిగా కూర్చొని చదవడం మంచిది కాదు.. అలాగని రిలాక్స్‌డ్ మోడ్‌లో ఉంటూ ప్రిపరేషన్‌ను నెగ్లెక్ట్ చేయడం సరికాదు. అయితే చదివిన సమయంలో వంద శాతం దృష్టి సబ్జెక్ట్స్‌పైనే పెట్టాలి. ఎన్ని గంటలు చదివారనేది ముఖ్యం కాదు.. ఎంత ఎఫెక్టివ్‌గా చదివారనేది మీ సక్సెస్‌ను నిర్దేశిస్తుంది. IIT ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో విజయం సాధించడానికి ఒక రోజులో 5-6 గంటల సీరియస్ స్టడీ చాలా అవసరం.

ఇదీ చదవండి: Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 వేగం, కచ్చితత్వం
పరీక్షను పూర్తి చేయడానికి విద్యార్థులకు పరిమిత సమయం ఉంటుంది. అందుకే ఆన్సర్స్ గుర్తించడంలో స్థిరమైన వేగాన్ని (speed) కొనసాగించాలి, అదే సమయంలో కచ్చితత్వం (accuracy) కూడా ఉండాలి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. అందుకే పరిమిత సమయంలో ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల కచ్చితత్వం వస్తుంది.మెంటల్ స్ట్రెస్ వద్దు..
పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో.. పరీక్ష రాసే సమయానికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ప్రిపరేషన్ చివరి రోజుల్లో అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటే, అది ఎగ్జామ్ రిజల్ట్‌పై ప్రభావం చూపవచ్చు. ఏ పరీక్షకైనా మంచి ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకే రోజులో 6 నుంచి 7 గంటలు నిద్రకు కేటాయించండి. వీలైతే యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేయండి.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Exam Tips, Jee, JOBS

తదుపరి వార్తలు