ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1828 ఖాళీలున్నాయి. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ప్రిపేరషన్ ఎలా ప్రారంభించాలి అని అభ్యర్థుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. సాధారణంగా చాలా మంది ఇప్పటికే ఐబీపీఎస్ పీఓ, క్లర్క్‌లకు దఖాస్తు ప్రక్రియ పూర్తయింది. . ప్రిపరేషన్ చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో కాస్త భిన్నమైన సబ్జెక్టులతో కూడిన ఎస్ఓకు ప్రిపేర్ అవ్వడం అంత సులభం కాదు అనే అభిప్రాయం ఉంటుంది. ఏ అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయి. పీఓ, క్లర్క్ పరీక్షలకు సబ్జెక్టు పరంగా పోలిక ఉన్నా.. ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. ఎస్ఓ పరీక్షల కాస్త సబ్జెక్టు పరంగా టెక్నికల్ అంశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రిపరేషన్ ప్లాన్..
- బ్యాంక్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముందుగా ప్రతీ విభాగంలో పాస్ అయ్యేలా ప్రిపేర్ అవ్వాలి. మూడు విభాగాల్లో కనీస మార్కులు వచ్చిన వారివి మాత్రమే మెరిట్ స్కోర్‌ను పరిగనిస్తారు.
Internship: ఫ్రెషర్స్, కాలేజ్ స్టూడెంట్స్ కోసం టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ వివరాలు
ఇంగ్లీష్
- ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు..
- ఈ విభాగం ముఖ్య ఉద్దేశం అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills)ను పరీక్షించడం. ఇందులో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి.
- ఇడియమ్స్,సెంటెన్స్ కరెక్షన్, వొ కాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్ ఇం గ్లి (General English) నైపుణ్యం పెంచుకోవాలి.
- ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ అవేర్‌నెస్..
తాజా బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ (Banking) రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలపై ఉన్న సమయంలో పూర్తిగా సాధన చేయాలి.
ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్స్
గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్ (Mock Test) లకు హాజరు కావడం మేలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆయా విభాగాలు, అంశాల పరంగా వెయిటేజీపై అవగాహన వస్తుంది. గ్రాండ్ టెస్ట్‌ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా.. తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్ట్‌లకు హాజరవడం వల్ల పరీక్ష హాల్లో టైమ్ మేనేజ్‌మెంట్ పరంగా స్పష్టత వస్తుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్ పరీక్షను దృష్టిలోపెట్టుకొని చదివితే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడంతోపాటు మెయిన్‌కు కూడా సన్నద్ధత లభిస్తుంది.
PhonePe Jobs: ఫోన్‌పేలో మ్యూచ్‌వల్ ఫండ్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఫ్రెషర్స్‌కు అవకాశం
IBPS SO Recruitment 2021: ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2021 నవంబర్ 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 23
దరఖాస్తు ఫీజు చెల్లింపు- 2021 నవంబర్ 3 నుంచి నవంబర్ 23
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల- 2021 డిసెంబర్
ప్రిలిమినరీ ఎగ్జామ్- 2021 డిసెంబర్ 12
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల- 2022 జనవరి
మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల- 2022 జనవరి
మెయిన్ ఎగ్జామ్- 2022 జనవరి 30
మెయిన్ ఎగ్జామ్ ఫలితాల విడుదల- 2022 ఫిబ్రవరి
ఇంటర్వ్యూ కాల్ లెటర్ విడుదల- 2022 ఫిబ్రవరి
ఇంటర్వ్యూ- 2022 ఫిబ్రవరి లేదా మార్చి
ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2022 ఏప్రిల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2021, IBPS