Home /News /jobs /

ARE YOU PREPARING FOR COMPETITIVE EXAMS F YOU LOOK AT THE DETAILS OF THE JEE TOPPERS PREPARATION OU WILL SAY WOW UMG GH

JEE Topper: పోటీ పరీక్షలుకు సిద్ధం అవుతున్నారా ? జేఈఈ టాపర్ చెప్తున్న ప్రిపేరేషన్ విశేషాలు చూస్తే వామ్మో అంటారు..!

పోటీ పరీక్షలుకు సిద్ధం అవుతున్నారా ? జేఈఈ టాపర్ చెప్తున్న ప్రిపేరేషన్ విశేషాలు చూస్తే  వామ్మో అంటారు..!

పోటీ పరీక్షలుకు సిద్ధం అవుతున్నారా ? జేఈఈ టాపర్ చెప్తున్న ప్రిపేరేషన్ విశేషాలు చూస్తే వామ్మో అంటారు..!

ఇటీవల జరిగిన జేఈఈ(JEE) మెయిన్ సెషన్ 1లో జార్ఖండ్‌‌లోని రాంచీ(Ranchi)కి చెందిన కుషాగ్ర శ్రీవాస్తవ 100 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. మొత్తంగా ఈ ఫీట్‌ను 14 మంది అందుకున్నారు. అందులో శ్రీవాస్తవ ఒకరు.

జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో జేఈఈ ఒకటి. ఐఐటీ(IIT) వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈలో మంచి స్కోర్ సాధించాలి. ఇందుకోసం విద్యార్థులు ఎన్నో ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతుంటారు. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ సెషన్ 1లో జార్ఖండ్‌‌లోని రాంచీకి చెందిన కుషాగ్ర శ్రీవాస్తవ 100 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. మొత్తంగా ఈ ఫీట్‌ను 14 మంది అందుకున్నారు. అందులో శ్రీవాస్తవ ఒకరు.

జేఈఈ(JEE)లో టాప్ ర్యాంక్ సొంతం చేసుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నాడు. జేఈఈ కోసం ప్రిపేర్ అయిన విధానం, తన భవిష్యత్తు లక్ష్యమేంటో ఇలా వివరించాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి ఇంజినీరింగ్ అంటే ఎంతో ఆసక్తి. కోర్ సబ్జెక్టులను ఎంతో ఇష్టంతో ప్రిపేర్ అయ్యాను. దీంతో పరీక్షలో విజయం సాధించడంలో అవి కీలకపాత్ర పోషించాయి. ప్రస్తుతం ఐఐటీ బాంబేలో సీటు సాధించాలనే లక్ష్యంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్‌ చేయడం నా కల’ అని శ్రీవాస్తవ చెప్పుకొచ్చాడు.

తన దృష్టి ఎప్పుడూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌పైనే ఉందని, దీంతో మెయిన్‌కు ఎక్కువ సమయం కేటాయించలేదని ఈ17 ఏళ్ల టాపర్ అన్నాడు. 2020 మార్చిలో 10వ తరగతి తర్వాత ఐఐటీ కోసం ఇతడు ప్రిపేరేషన్‌ను స్టార్ట్ చేశాడు. “జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం ప్రతిరోజూ 6 నుంచి 7 గంటలు ప్రిపేర్ అవుతున్నాను. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలకు కేవలం ఒక నెల ముందు నుంచి సన్నాహాలు ప్రారంభించాను.’ అని శ్రీవాస్తవ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!


టెస్ట్-టేకింగ్ స్కిల్స్ మెరుగుపర్చుకోవడానికి మాక్ టెస్ట్‌లను శ్రీవాస్తవ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. ప్రిపరేషన్‌లో ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పుస్తకాలపై ఎక్కువగా ఆధారపడినట్లు.. అలాగే కోటా‌లోని అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ క్లాస్ నోట్స్ రివిజన్ చేయడానికి ఉపయోగపడినట్లు తెలిపాడు.

శ్రీవాస్తవకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్. ఇది ఆలోచనలను ప్రేరేపించడంతో పాటు ఎంతో ఫన్నీగా కూడా ఉంటుందంటాడు. కంప్యూటర్ సైన్స్ ద్వారా సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నాడు. పెయింటింగ్, బ్యాడ్మింటన్ తన ఇతర వ్యాపకాలని చెప్పుకొచ్చాడు.

శ్రీవాస్తవ తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. తండ్రి సంతోష్ కుమార్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాగా, తల్లి నీలం లత జార్ఖండ్ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ. శ్రీవాస్తవ.. టుపుదానాలోని సీబీఎస్‌ఈ బోర్డు బ్రిడ్జ్‌ఫోర్డ్ స్కూల్ విద్యార్థి. అతడు ఇప్పుడు ఇంటర్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. డోరాండాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్‌లో 2020లో పదో తరగతిలో 97.8 శాతం మార్కులతో పాసయ్యాడు. అప్పటి నుంచి జేఈఈ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు.కాగా, జేఈఈ మెయిన్ సెషన్-1లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. అయితే ఇంకా టాప్ ర్యాంక్ ప్రకటించలేదు. జులై 21న ప్రారంభం కానున్న JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల ఫలితాల ప్రకటన తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. సెషన్ 1 కోసం మొత్తం 8,72,432 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 7,69,589 మంది హాజరయ్యారు. సెషన్ 1లో 100 పర్సంటైల్ సాధించిన 14 మంది విద్యార్థుల్లో నలుగురు తెలంగాణకు చెందినవారు కాగా, ముగ్గురు ఏపీకి చెందిన వారు. అలాగే అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, కర్ణాటక నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
Published by:Mahesh
First published:

Tags: IIT, Jee, Jharkhand, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు