హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Exam Reasoning Tips: బ్యాంక్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా.. ఇలా చేస్తే రీజనింగ్ లో మంచి మార్కులు సాధించొచ్చు..

Bank Exam Reasoning Tips: బ్యాంక్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా.. ఇలా చేస్తే రీజనింగ్ లో మంచి మార్కులు సాధించొచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రీజనింగ్ లో ముందుగా మనము రీజనింగ్ ఎబిలిటీ గురించి తెలుసుకోవాలి. ఎనభై శాతం పజ్జిల్స్ చదువుకుంటే రీజనింగ్ లో స్కోరింగ్ బాగా వస్తుంది. దీనిలో స్కోరింగ్ కొరకు ఎలా చదవాలి.. ఏ రకంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనే విషయాలను తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

  రచయిత: మాధురి, బ్యాంకు పరీక్షల ర్యాంకర్, కౌటిల్య ఇనిస్టిట్యూట్, తిరుపతి

  (సేకరణ: GT Hemanth Kumar, News18, Tirupati)

  ఐబీపీఎస్(IBPS) పరీక్షలో ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే.. అది రీజనింగ్ (Reasoning) వల్లనే సాధ్యం అవుతుంది. రీజనింగ్ పర్ ఫెక్ట్ గా(Reasoning Prefect) నేర్చుకుంటే కచ్చితంగా మార్కులు(Marks) సాధించవచ్చు. అయితే దీనిలో కూడా కాస్త కష్టం అనిపించే ప్రశ్నలు(Question) కూడా ఉంటాయి. వాటిని ఎలా నేర్చుకోవాలి. వాటి నుంచి టైంను ఎలా సేవ్(Time Save) చేసుకోవాలనే విషయాలను కౌటిల్య ఇనిస్టిట్యూట్(Koutilya Institute) , బ్యాంక్ పరీక్షలలో ర్యాంక్ సాధించిన మాధురి(Madhuri) విద్యార్థులకు సూచించారు. రీజనింగ్ లో ముందుగా మనము రీజనింగ్ ఎబిలిటీ (Reasoning Ability) గురించి తెలుసుకోవాలి. ఎనభై శాతం పజ్జిల్స్(Puzzles) చదువుకుంటే రీజనింగ్ లో స్కోరింగ్(Scoring) బాగా వస్తుంది.

  Samsung Galaxy S23 Ultra: శాంసంగ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. 200MP కెమెరాతో శాంసంగ్ మొబైల్.. పూర్తి వివరాలిలా..


  ఈ పజిల్స్ ను కొందరు 2 నిమిషాల్లో మరికొందరు 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తుంటారు. కానీ పజిల్స్ మనం ప్రశ్న చదువుతున్న సమయంలోనే అర్థం చేసుకొని సాల్వ్ చేస్తే టైం కలసి వస్తుంది. పజిల్స్ లో 20 నుంచి 25 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక మెయిన్స్ కోసం ఫజిల్స్ ను లోతుగా అధ్యాయం చేస్తూ చదువుకోవాలి. ఇనిక్వాలిటిస్., శిలాజిజమ్స్., ఆల్ఫా న్యూమరిక్ సిరీస్., బ్లడ్ రిలేషన్ మరి కొన్ని టాపిక్స్ గా ఉంటాయి.

  ఇనిక్వాలిటీస్: ఇనిక్వాలిటీస్ లో ప్రశ్న చూసిన వెంటనే బదులు రాసేలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఇనిక్వాలిటీస్ ని నేర్చుకోవాలంటే వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. మనం ఎంచుకొనే మార్గం ద్వారానే సులభంగా సాల్వ్ చేసేదై ఉండాలి.

  శిలాజిజమ్స్: శిలాజిజమ్స్ నేర్చుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి వెన్ డైయాగ్రమ్ ద్వారా చేయవచ్చు. రెండవది వివిధ రకాల ఫార్ములా ద్వారా చేయవచ్చు. రెండు మెథడ్ లోను సమాధానాలు త్వరగా సాల్వ్ చేయవచ్చు. అయితే పరీక్షా సమయంలో ఫార్ములాస్ గుర్తు రాకపోవచ్చు. అదే వెన్ డైయాగ్రమ్ అయితే మనకు గుర్తు ఉండిపోతుంది.

  బ్లడ్ రిలేషన్: ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాని పజిల్ రూపంలో ఇస్తాడు. ఇందులో మూడు ప్రశ్నలు ఉంటాయి. వీటిని చదువుతున్న సమయంలోనే సమాధానం పసిగట్టాలి.

  కోడింగ్ అండ్ డీకోడింగ్: ఒక సెంటన్స్ ఇస్తారు..ఒక్కో వార్డ్ కి ఒక్కో కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా నాలుగు పదాలు ఇస్తారు. అందులో కామన్ గా ఉన్న పదాల ఆధారంగా కోడింగ్ డీకోడింగ్ చేయాల్సి ఉంటుంది.

  Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !


  ఇన్పుట్ అవుట్ ఫుట్: మనకు ప్రశ్నలు ఒక్క ప్యాట్రన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఆ రూల్ ఎలా వచ్చిందో... దాన్ని ఎలా సాల్వ్ చేసారో తెలుసుకొని కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన రూల్ ఫేలౌ అవుతూ... ఇన్పుట్ అవుట్ ఫుట్ ను సాల్వ్ చేయాలి.

  ఆల్ఫా న్యూమరిక్ సిరీస్: ఈ టాపిక్ చాలా సులభంగా ఉంటుంది. న్యూమరిక్స్., ఆల్ఫాబెట్స్., సిమ్బల్స్ కలిగి ఉంటుంది.  కేవలం పజిల్స్ చేయడం ద్వారా అధిక మార్కులు సాధించే అవకాశం ఉంది. ఒక్క పజిల్స్ ప్రతి టాపిక్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలా ఎక్కువగా మోడల్ పరీక్షలు రాయడం ద్వారా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.

  Published by:Veera Babu
  First published:

  Tags: Bank, Bank exam, Career and Courses, IBPS, JOBS, Preparation

  ఉత్తమ కథలు