Home /News /jobs /

ARE YOU PREPARING FOR AGNIVEER AIR FORCE JOBS YOU FOLLOW THE BELOW MENTIONED TIPS THEN SUCCESS IS YOURS VSP VB

Agniveer Jobs: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ప్రిపరేషన్ టిప్స్ ఏంటి..? తెలుసుకోండి..

Agniveer Jobs: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ప్రిపరేషన్ టిప్స్ ఏంటి..? తెలుసుకోండి..

Agniveer Jobs: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ప్రిపరేషన్ టిప్స్ ఏంటి..? తెలుసుకోండి..

Agniveer Jobs: దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు. ఇందులో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌, నేవీల్లో ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (P. Anand Mohan, News 18, Visakhapatnam)

    దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ(Navy), ఎయిర్ ఫోర్స్ లలో(Airforce) చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో(Agnipath) భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు. ఇందులో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌, నేవీల్లో ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అభ్యర్ధులను సెలక్ట్ చేసేందుకు ఇండియన్ నేవీ సన్నద్దమవుతోంది. అసలు ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో ఫేజ్1 లో రాతపరీక్ష కు ఎలా ప్రిపేర్(Preparation) అవ్వాలి? ఎలా ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి? చూద్దాం. ఈ ప్రిపరేషన్ టిప్స్..  మొదటి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో సహాయపడతాయి.

    Postal Assistant Jobs: పోస్టల్ అసిస్టెంట్(PA/SA) నియామకాలపై కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ లో పలు మార్పులు..


    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షల్లో ఫేజ్ 1లో ఆన్‌లైన్ రిటన్ పరీక్ష ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షలు మూడు విభాగాలుగా జరుగుతాయి. 1)Science, 2)Other than Science, 3)Science and other than Science అనే మూడు గ్రూపులుగా జరుగుతాయి. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో నిర్వహిస్తారు. పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కు ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్ష మూడు గ్రూపులుగా జరిగినా.. సబ్జెక్ట్ లు మాత్రం ఐదే వుంటాయి. అవి ఇంగ్లీష్, మేధమేటిక్స్, ఫిజిక్స్, రీజనింగ్ మరియు జనరల్ అవేర్ నెస్.



    1), Science గ్రూపుకి సంబంధించిన పరీక్ష వివరాలు చూస్తే.. ఇందులో ఇంగ్లీష్ 20, మేధమేటిక్స్ 25, ఫిజిక్స్ 25 మార్కులు కలిపి 70 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాలు సమయం ఇస్తారు.
    2). Other than Science గ్రూపుకి సంబంధించిన పరీక్ష వివరాలు చూస్తే.. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్ నెస్ 30 మార్కులు, ఇంగ్లీష్ 20 మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. 45 నిమిషాల సమయం ఇస్తారు.
    3). Science & Other than Science గ్రూప్ పరీక్షలో ..మేధమేటిక్స్ 25, ఇంగ్లీష్ 20, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్ 30, ఫిజిక్స్ 25 మార్కులు కలిపి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 85 నిమిషాలు సమయం ఇస్తారు.

    ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్ష -2022 ప్రిపరేషన్ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి. ఎలా చదవాలి?

    1) స్టడీ మెటీరియల్‌లను సేకరించి, రాబోయే పరీక్షకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునేందుకు కృషి చేయండి.  మీ ప్రిపరేషన్‌లలో ఉపయోగించే స్టడీ మెటీరియల్‌ ను సులభంగా చదవగలిగేలా చూసుకోవాలి

    2)వివిధ సబ్జెక్టుల కోసం వేర్వేరు పుస్తకాలను కొనుగోలు చేయడానికి బదులుగా అన్ని అంశాలకు సంబంధించి ఉండే మంచి పుస్తకాలను సెలక్ట్ చేసుకోండి. రోజువారీ అధ్యయన టైమ్‌టేబుల్ మరియు లక్ష్యాలను సెట్ చేయండి

    BIS Recruitment 2022: బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. BISలో పలు పోస్టుల భర్తీ.. జీతం రూ. 50వేలు..


    3) రోజువారీ అధ్యయన టైమ్‌టేబుల్ మరియు లక్ష్యాలను సెట్ చేయండి. ఆ టైమ్ టేబుల్ మిస్ కాకుండా చూడండి. పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు ప్రిపేర్ అవడం కోసం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.

    4) ప్రిపర్ అయిన అంశాలపై మాక్ టెస్ట్‌లకి హాజరవ్వండి. పరీక్షకు ముందు కనీసం 5 నుండి 6 మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ లలో ఫలితాలను చూసుకోండి.

    5) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ సిలబస్, పరీక్ష కోసం ఖచ్చితమైన తయారీ కోసం టెస్ట్ నమూనాను సేకరించండి.

    6) అధిక వెయిటేజీ అంశాలు, ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలు అంశాలపై దృష్టి పెట్టండి.

    7) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షా సరళిని అర్థం చేసుకోవడం వలన మీ భవిష్యత్తులో చదువులు మరియు
    ప్రిపరేషన్‌లో కూడా సహాయపడుతుంది.

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఆన్ లైన్ పరీక్షా వ్యూహం ఎలా ఉండాలి. పరీక్ష ఎలా రాయాలి.? ఎలా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.?

    1)ఎగ్జామ్ ప్యాట్రన్ కు సంబంధించి, అందులో వచ్చే ప్రశ్నలకు సంబంధించి మంచి అవగాహన ఉండేలా చూసుకోవాలి. ప్రశ్నలను ఈజీగా రాయగలిగేలా యత్నించాలి. ఏ టాపిక్ ను దాటవేయకుండా అన్నింటినీ ప్రిపేర్ అవడం మంచిది.

    2)పరీక్షల్లో గత సంవత్సరం జరిగిన పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్పటి పరీక్షల ప్రశ్నలను ప్రిపేర్ కావడం మంచిది.

    3)ఏదైనా ప్రశ్న కష్టంగా అనిపిస్తే, చివరిగా పట్టుకోండి. సమయాన్ని వృధా చేయవద్దు, పరీక్షలో సమయం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

    Agniveer Jobs: అగ్నివీర్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. అయితే పరీక్ష విధానం.. ఎంపిక ప్రక్రియ వివరాలిలా..


    4) సులభమైన ప్రశ్నలను ముందుగా ప్రయత్నించి, సమయాన్ని సేవ్ చేసుకోవడం తెలివైన పని. చివరి నిమిషం వరకు ట్రై చేస్తూ ఉండకండి. రాసిన సమాధానాలను జాగ్రత్తగా తనిఖీ చేయడం కోసం .. చివరలో కొంత సమయం ఉండేలా .. చూసుకోండి.

    5) రోజువారీ ప్రాక్టీస్ ద్వారా, మాక్ టెస్ట్‌లు అభ్యర్థిని మరింత సమర్థవంతంగా మరియు సమయ నిర్వహణ గురించి తెలుసుకునేలా చేస్తాయి.6) మార్కింగ్ స్కీమ్‌తో పాటు పరీక్షలో ముఖ్యమైన అంశాల వెయిటేజీని తెలుసుకోవడంలో మాక్ టెస్ట్ ప్రశ్నలు మీకు సహాయపడతాయి. ఎక్కువ మార్కులు తెచ్చే కాన్సెప్ట్‌లకు మీరు మరింత శ్రద్ధ వహించవచ్చు.

    ఇలా ఒక ప్లాన్ ప్రకారం, ప్రిపరేషన్ టిప్స్, ఎగ్జామ్ రాసే సమయంలో తీసుకోవాల్సిన టిప్స్ ను పాటిస్తే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షలో సులభంగా గట్టెక్కవచ్చు. ఎక్కువ మార్కులు సాధించి మిగిలిన రౌండ్లకు క్వాలిఫై కావచ్చు. ఆల్ ది బెస్ట్.
    Published by:Veera Babu
    First published:

    Tags: Agniveer, Career and Courses, Exam Tips, JOBS, Preparation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు