ARE YOU PREPARING FOR A US STUDENT VISA INTERVIEW THESE ARE THE INSTRUCTIONS OF THE US CONSULAR AUTHORITIES GH VB
Acing Your Interview: యూఎస్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నారా..? యూఎస్ కాన్సులర్ అధికారుల సూచనలు ఇవే!
ప్రతీకాత్మక చిత్రం
యునైటెడ్ స్టేట్స్(United States)లో చదువుకోవడానికి స్టూడెంట్ వీసా(Student Visa) కోసం దరఖాస్తు చేసే ప్రక్రియను చాలా మంది విద్యార్థులు గొప్పగా ఫీల్ అవుతారు. ఈ ప్రక్రియలో విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చేందుకు యూఎస్ కాన్సులర్ అధికారులు తెలిపిన వివరాలను తెలుసుకోండి.
యునైటెడ్ స్టేట్స్(United States)లో చదువుకోవడానికి స్టూడెంట్ వీసా(Student Visa) కోసం దరఖాస్తు చేసే ప్రక్రియను చాలా మంది విద్యార్థులు గొప్పగా ఫీల్ అవుతారు. ఏటా చాలా మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళ్తారు. ఈ ప్రక్రియలో విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చేందుకు యూఎస్ కాన్సులర్ అధికారులు తెలిపిన వివరాలను తెలుసుకోండి.
ఈ సంవత్సరం పదివేల మంది భారతీయులు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌లలో విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు హాజరవుతారు. చాలా మంది యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడానికి వెళ్తున్నవారే ఉంటారు. వారు అక్కడ పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేసి, నిస్సందేహంగా H-1B ప్రోగ్రామ్ కింద ఉద్యోగాలు పొందుతారు.
యునైటెడ్ స్టేట్స్లో చదువు ప్రయాణాన్ని ప్రారంభించేందుకు, ముందుగా యూఎస్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్ని పొందాలి. ఏ యూనివర్సిటీలో చదువుకోవాలనే దానిపై స్పష్టత లేకపోతే సహాయం చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఆసక్తిగల విద్యార్థులకు సహాయం చేయడానికి యూఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్(USIEF) ఉంది.
ఏ యూనివర్సిటీలో చదువుకోవాలనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత యునైటెడ్ స్టేట్స్లో ప్రవేశించడానికి వీసా అవసరం. వీసా అధికారులు దరఖాస్తు చేసుకున్న వారిలో గమనించే అంశాలు, అడిగే ప్రశ్నల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 1952 ఇమ్మిగ్రేషన్, నేషనాలిటీ యాక్ట్ ఆధారంగా కొన్ని అర్హతలను పరిశీలించి అధికారులు విద్యార్థి వీసాలను ఆమోదిస్తారు.
* నిబంధనల్లో ముఖ్యమైనవి ఇవే..
విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందారనే అంశాన్ని ధ్రువీకరించాలి: అప్రూవ్డ్ ఫారమ్ I-20ని చూపించాలి. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(SEVIS) ఫీజును చెల్లించినట్లు చూపాలి.
చదువుకోవాలనే కారణంతో యునైటెడ్ స్టేట్స్కు వెళ్తున్నట్లు స్పష్టం చేయాలి: ఏదైనా ఉద్యోగం చేయాలని యూఎస్‌కు వెళ్తుంటే అందుకు H-1B టెంపరరీ వర్కర్ ప్రోగ్రామ్ వీసా పొందాల్సి ఉంటుంది, స్టూడెంట్ వీసా కాదు.
చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వస్తామని నిరూపించాలి: గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) పూర్తవుతుంది.
చదువు ఖర్చులను భరించగలమని చూపాలి: యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడానికి విద్యార్థులను పంపడానికి చాలా కుటుంబాలు డబ్బును ఆదా చేస్తుంటాయి. కుటుంబ సభ్యులు విద్యా ఖర్చులకు సహకరిస్తున్నట్లయితే, ఆ డబ్బును చూపాలి. చదువుతున్నప్పుడు సొంత అవసరాలకు, ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చవుతుందో, యూఎస్‌లో ఉన్న మొత్తం కాలానికి ఎంత కావాలో ముందుగానే తెలుసుకోవాలి.
డిగ్రీని అభ్యసించడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థిగా నిరూపించుకోవాలి: అకౌంటింగ్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేస్తుంటే, క్రెడిట్, డెబిట్ మధ్య వ్యత్యాసం తెలియకపోతే, బహుశా ఆ డిగ్రీ ప్రోగ్రామ్‌కు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటివి అధికారులు పరిశీలిస్తారు. సౌకర్యవంతంగా మాట్లాడటానికి తగినంత ఆంగ్ల సామర్థ్యం కూడా ఉండాలి.
ఇంటర్వ్యూలో అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం, సక్రమంగా స్పందించడం అవసరం. ప్రశ్న వినకపోతే లేదా అర్థం చేసుకోకపోతే, మళ్లీ అడగమని కోరడం సరైందే. చదువుతున్న వాటిపై మీకు మక్కువ ఉందని, ప్రస్తుత అనుభవం, ఎంచుకున్న ప్రోగ్రామ్‌పై ఆసక్తి ఉందో లేదో అధికారులు గుర్తిస్తారు. ఒకప్పుడు ఇంజనీర్‌గా ఉండి ఇప్పుడు మేనేజ్మెంట్ చదవాలనుకుంటే, ఆ నిర్ణయానికి ఎలా వచ్చారో? స్పష్టంగా వివరించాలి. యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడానికి మీ సొంత ఆసక్తులు, కారణాలు తెలియజేయడంపై దృష్టి సారించాలి. అప్పుడే విజయం సాధించగలరు.
ఇంటర్వ్యూ కోసం సిద్ధమవడంలో ఇవి పాటించండి..
• ప్రిపేర్ అవ్వండి.. అతిగా వద్దు: చాలా మంది విద్యార్థులు ముందుగా ప్రిపేర్ అయిన స్క్రిప్ట్‌ను అధికారులకు వినిపిస్తారు. అధికారులు జ్ఞాపక శక్తిని అంచనా వేయడానికి లేరని గుర్తించాలి. యూఎస్ విశ్వవిద్యాలయంలో చదివి డిగ్రీని ఎందుకు పొందాలనుకుంటున్నారు.. అనే ఆసక్తిని విద్యార్థి గొంతులో వినాలని అధికారులు భావిస్తారు.
• నమ్మకంగా ఉండండి: భయాందోళనలకు గురి కాకూడదు. విద్యార్థులు వేచి ఉండే గది బిజీగా ఉంటుంది. వీసా అధికారులు తరచూ ఎక్కువగా ప్రశ్నలు అడగకపోవచ్చు. కొన్ని సందర్బాల్లో ఇంటర్వ్యూ కేవలం 60 సెకన్లలో ముగియవచ్చు. ఇంటర్వ్యూ కోసం అధికారి ముందుకు వచ్చినప్పుడు ఎక్కువగా గాలి పీల్చుకోండి. గట్టిగా, స్పష్టంగా మాట్లాడాలి.
* రికార్డు స్థాయిలో దరఖాస్తులు..
గతంలో కంటే ఎక్కువ విద్యార్థి వీసాలను అమెరికా అధికారులు ఆమోదిస్తున్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకు భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్లు 120,000 మంది విద్యార్థి వీసా దరఖాస్తుదారులను పరిశీలించాయి. అత్యధికులు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో చదువుతున్నారు. రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం దరఖాస్తులు అందాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.