ARE YOU GOING TO AMERICA FOR THE FIRST TIME THEN YOU SHOULD KNOW ABOUT PORT OF ENTRY PROCEDURE GH SRD
Port of Entry: మీరు అమెరికాకు మొదటిసారి వెళ్తున్నారా..? అయితే ‘పోర్ట్ ఆఫ్ ఎంట్రీ’పై అవగాహన తప్పనిసరి..!
ప్రతీకాత్మక చిత్రం
Port of Entry: అమెరికాకు వెళ్లే సమయంలో విద్యార్థులు పలు కీలకమైన డాక్యుమెంట్లను తమ వెంట తీసుకెళ్లాలి. వ్యాలిడ్ పాస్‌పోర్ట్, F-1 స్టూడెంట్ వీసా, అప్రూడ్ ఫారమ్ I-20 A-B వంటివి ఇందులో ప్రధానమైనవి.
టూరిస్ట్గానో లేక ఉన్నత చదువుల కోసమో అమెరికా(USA)కు మొదటిసారి వెళ్తుంటే, మీకు కొన్ని విషయాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీజర్ గురించి తెలుసుకుని ఉండాలి. అమెరికాకు వస్తున్న సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కొన్ని నిబంధనలతో కూడిన ‘పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీజర్’ను ఏర్పాటు చేసింది. దీనిపై అవగాహన ఉంటే సులభంగా, అతి తక్కువ సమయంలో ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీజర్ గురించి తెలుసుకోవాలంటే అమెరికాకు వెళ్లే ముందు దేశంలోని యూఎస్ ఎంబసీని సందర్శించాలి. అక్కడ ఉన్న యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అటాచ్ ఆఫీస్‌లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నిపుణులు ఉంటారు. అమెరికాకు వెళ్లేటప్పుడు మీ ప్రయాణాన్ని వీలైనంత సౌకర్యంగా ఉండడానికి వారు తగిన సమాచారాన్ని అందిస్తారు.
* కీలక డాక్యుమెంట్ల సేకరణ- బ్యాకప్
అమెరికాకు వెళ్లే సమయంలో విద్యార్థులు పలు కీలకమైన డాక్యుమెంట్లను తమ వెంట తీసుకెళ్లాలి. వ్యాలిడ్ పాస్‌పోర్ట్, F-1 స్టూడెంట్ వీసా, అప్రూడ్ ఫారమ్ I-20 A-B వంటివి ఇందులో ప్రధానమైనవి. ఒక వేళ వీటిని పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగలించినా.. ముందు జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్‌కు సంబంధించిన డిజిటల్ కాపీలను బ్యాకప్‌గా ఉంచుకోవాలి. అలాగే ఒరిజినల్స్ కూడా ఉండేలా చూసుకోండి.
స్కూల్‌ను సంప్రదించే సమాచారం, స్కూల్ అడ్మిషన్ లెటర్ వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా అమెరికా వేళ్లే సమయంలో ఎంతో సహాయపడతాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు డాక్యుమెంట్లను ఒకసారి చెక్ చేసుకోని క్రమపద్దతిలో ఒకచోట భద్రంగా ఉంచుకోండి. అమెరికాలో ల్యాండ్ అయినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీజర్ కోసం CBP అధికారిని సంప్రదించడానికి మీ వంతు వస్తుంది. వెంటనే ఆ డాక్యుమెంట్లను చూపించి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.
* ప్యాకింగ్ వస్తువులపై అవగాహన
కొన్ని రకాల ఆహార ఉత్పత్తులు, మందులను యునైటెడ్ స్టేట్స్లో నిషేధించారు. మీరు అటువంటి వస్తువులతో పట్టుబడితే వాటిని సీజ్ చేస్తారు. దీంతో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లడానికి మీకు ఆలస్యం కావచ్చు. కాబట్టి బ్యాగ్‌లను ప్యాక్ చేసే ముందు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలి అనేదానిపై అవగాహన ఉండాలి.
అమెరికాకు వెళ్లేటప్పుడు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలి, వేటిని వదిలివేయాలి అనేదానిపై క్లారిటీ కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ముందుగా CBP వెబ్‌సైట్‌ని సందర్శించి, అందులోని బ్రింగింగ్ ఫుడ్‌ని ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనే సెక్షన్‌ను పరిశీలించాలని సూచించారు.
* ఈ సూచనలు పాటించండి
పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీజర్‌ను నావిగేట్ చేయడం కొంత ఆందోళనగా అనిపించవచ్చు. ముఖ్యంగా మొదటిసారి ప్రయాణించే వారికి ఈ అనుభవం ఉంటుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా రిలాక్స్‌గా ఉండడానికి ప్రయత్నించండి. అధికారులు ఇచ్చే సూచనలను పాటించండి.
* నిజం చెప్పండి
పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఫ్రొసీజర్ సమయంలో ఎట్టిపరిస్థితుల్లో CBP అధికారులకు అబద్ధం చెప్పకూడదు. ప్రయాణికులు, విద్యార్థులు అమెరికాలోకి అడుగు పెట్టే సమయంలో తీసుకొస్తున్న వస్తువుల వివరాలను కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. వస్తువులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే మీకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇది ఆలస్యంతోపాటు ఇతర సమస్యలకు దారితీయవచ్చు. CBP అధికారులతో మీ సంభాషణ చాలా చిన్నగా, సరళంగా, సూటిగా ఉండాలన్న సంగతి గుర్తుంచుకోండి. ఇందుకోసం మీరు ప్రశాంతంగా ఉండండి. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పండి.
సాధారణ పరిస్థితుల్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీజర్ కోసం CBP అధికారిని సంప్రదించడం నుండి మీ బ్యాగ్‌లను చేతిలో ఉంచుకుని విమానాశ్రయం నుండి నిష్క్రమించడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ముఖ్యంగా అనేక అంతర్జాతీయ విమానాలు ఒకే సమయంలో వచ్చినట్లయితే, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ లైన్లు క్లియర్ కావడానికి ఎక్కవ సమయం పట్టొచ్చు. అందుకు కూడా మీరు సిద్ధంగా ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.