Home /News /jobs /

ARE YOU GOING FOR AN INTERVIEW JUST FOLLOW THESE JOB GUARANTEE FOR YOU UMG GH

Interview Tips: మీరు ఇంటర్వ్యూకు వెళ్తున్నారా ? ఇవి పాటిస్తే చాలు.. మీకు జాబ్ గ్యారెంటీ !

ఇంటర్వ్యూ టిప్స్

ఇంటర్వ్యూ టిప్స్

కొత్త ఉద్యోగాల కోసం ప్రతి సంస్థ ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. విభిన్న మార్గాల ద్వారా తమ కంపెనీ (Company)అవసరాలకు సరిపోయే వ్యక్తిని రిక్రూటర్లు సెలక్ట్ చేస్తారు. అయితే ఇలా ఇంటర్వ్యూల్లో (Interview) ఎవరిని కంపెనీలు సెలక్ట్ చేస్తాయి, ఎవరికి విస్మరిస్తాయనే విశ్లేషణల గురించి అభ్యర్థు?

ఇంకా చదవండి ...
కొత్త ఉద్యోగాల కోసం ప్రతి సంస్థ ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. విభిన్న మార్గాల ద్వారా తమ కంపెనీ అవసరాలకు సరిపోయే వ్యక్తిని రిక్రూటర్లు సెలక్ట్ చేస్తారు. అయితే ఇలా ఇంటర్వ్యూ (Interview)ల్లో ఎవరిని కంపెనీలు సెలక్ట్ చేస్తాయి, ఎవరికి విస్మరిస్తాయనే విశ్లేషణల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. రిక్రూటర్లు ఎవరిని సెలక్ట్ చేయాలనేది నిర్ణయించడానికి రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. వీటిలో మొదటిది రెజ్యూమ్(Resume). మరొకటి వ్యక్తిత్వం (Personality). ఈ రెండూ ఉద్యోగార్థుల విజయాలకు ఎలా తోడ్పడతాయో తెలుసుకుందాం.

రెజ్యూమ్ అనేది స్టోరీబోర్డ్ లాంటిది. ఇక్కడ రిక్రూటర్‌కు ఆకట్టుకునే కథనాన్ని చెప్పడం మీ లక్ష్యంగా ఉండాలి. రిక్రూటర్‌ను ఆకట్టుకోవడానికి, మీ స్టోరీ చెప్పడానికి మీకు కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. మీ స్టోరీ నమ్మదగినదిగా ఉంటే, రిక్రూటర్ దాన్ని హైరింగ్ మేనేజర్‌కి ఫార్వర్డ్ చేస్తారు. తదుపరి రౌండ్‌కు మిమ్మల్ని సిఫార్సు చేస్తారు. ఈ ప్రాథమిక వ్యత్యాసం అర్హత కలిగిన అభ్యర్థిని తిరస్కరణకు గురైన వ్యక్తికి మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయో తెలుపుతుంది. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే.. అదే మీ విజయానికి మొదటి మెట్టు అని చెప్పవచ్చు. చాలా మంది అకడమిక్స్‌లో మంచి ప్రావీణ్యం, నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో సక్సెస్ కావట్లేదు. ఎందుకంటే వారు పెద్ద స్థాయిలో అర్హతలు సాధించిన తర్వాత కూడా తమ స్టోరీలను నైపుణ్యంగా ప్రదర్శించలేకపోతున్నారు.

సమర్థవంతమైన రెజ్యూమ్‌ను రూపొందించడంలో మీకు సహాయపడే అంశాలు మూడు ఉన్నాయి. అవేంటంటే..

1. ముందు మీ నైపుణ్యాలను హైలైట్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. మీకు బలం లేని, సగం తెలిసిన నైపుణ్యాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తావించవద్దు. ఎందుకంటే, ఒకవేళ మీరు రిక్రూట్ అయితే ఈ వివరాలతో పాటు గత అనుభవం ఆధారంగానే మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. తప్పుడు విషయాలు పేర్కొంటే, మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

2. మీరు ఉద్యోగం పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు, గతంలో మీరు వివిధ కోర్సుల ద్వారా ఎలా నైపుణ్యం సాధించారు, కొత్త నైపుణ్యాలను పొందే మీ సామర్థ్యాన్ని ఎలా పెంచుకున్నారు? అనేవి వివరణాత్మకంగా పొందుపర్చాలి.

3. చివరగా, మీ నాయకత్వ లక్షణాలు, మీరు ఎలాంటి కమ్యూనిటీని మ్యానేజ్ చేశారు, ఎలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నారు అనేవి అన్నీ పరిగణనలోకి వస్తాయి. వీటన్నింటినీ ప్రాధాన్యం ప్రకారం పేర్కొనండి.

అయితే రెజ్యూమ్‌ను సిద్ధం చేసినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఈ విషయంలో అత్యంత కీలకమైన అంశం EQ (emotional quotient). ఇంటర్వ్యూ ప్రక్రియలో ఇది ఎందుకు ఉంటుందని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఈ విషయాల గురించి ఆలోచించండి.

- మీరు ఒక టీమ్‌లో ఎలా పని చేస్తారు?

- మీరు ఒక టీమ్‌ను ఎలా లీడ్ చేస్తారు?

- కంపెనీకి ఉపయోగపడేలా మిమ్మల్ని మీరు ఎలా సర్దుబాటు చేసుకుంటారు?

ఇవన్నీ రిక్రూటర్లు పరిగణనలోకి తీసుకునే ప్రాథమిక అంశాలు. నైపుణ్యాలు ఉన్న హైరింగ్ టీమ్.. అభ్యర్థి మనస్తత్వాన్ని అంచనా వేస్తుందని గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎలా మ్యానేజ్ చేస్తారు, ఆ పరిస్థితుల్లో యాజమాన్యం తరఫున బాధ్యత తీసుకుంటారా, లేదా.. అనేవి వారు అంచనా వేస్తారు.ఇవి ఎంట్రీ-లెవల్ అభ్యర్థుల భవిష్యత్తును మారుస్తాయి. వారిని సీనియర్-లెవల్ లేదా లీడర్‌షిప్ పొజిషన్స్‌కు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మీ రెజ్యూమ్.. మీరు వ్యక్తులను ఎలా మ్యానేజ్ చేస్తారు, ఇన్‌స్ఫైర్ చేస్తారు అనేవి తెలుపుతుంది. పని ద్వారా మీరు పొందిన ఇంపాక్ట్‌కు ప్రాధాన్యతనివ్వాలి, హైలైట్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ కోసం వేచి చూడాలి.
Published by:Mahesh
First published:

Tags: Government jobs, JOBS, Resume, Vacancies

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు