Education Loan: ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ఉన్నత విద్య రుణాల కోసం దరఖాస్తు చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

మంచి విద్యాసంస్థలలో ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులు భావిస్తుంటారు. ఇందుకు ఆర్థిక స్థోమత లేక కొందరు విద్యార్థులు విద్యా రుణాణాలపై ఆధారపడతారు. కాగా, ఈ రుణాలు తీసుకునే ముందు కొన్ని విషయాలు గమనించాలి.

  • Share this:
మంచి విద్యాసంస్థలలో ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులు భావిస్తుంటారు. ఇందుకు ఆర్థిక స్థోమత లేక కొందరు విద్యార్థులు విద్యా రుణాలు తీసుకుంటారు. అయితే ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేంటో చూద్దాం.

సరైన కెరీర్ ఎంచుకోవడం.:

ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలు వెంటనే తిరిగి చెల్లించేంత చిన్న అమౌంట్ ఏమీ కాదు. విదేశాలలో వసతి ఖర్చుతో పాటు కోర్సు ఫీజులు చెల్లించడానికి చాలా డబ్బు కావాలి. ఇందుకు, విద్యారుణాలు తీసుకోవచ్చు కానీ మళ్ళీ తిరిగి చెల్లించగలమా లేదా అనేది ఆలోచించుకోవాలి. లోన్ తీసుకుని చదివే చదువులను మీరు పూర్తి చేయగలరా.. లోన్ తీర్చగల జీతం సంపాదించగలరా అనేది బేరీజు వేసుకోవాలి. రుణాలపై చదువులు చదివేటప్పుడు మంచి కెరీర్ ఆప్షన్ ని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం.

అర్హతను చెక్ చేసుకోవడం:

బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి చాలా ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీ (6.75% వార్షిక వడ్డీ రేటు) రేట్లతో విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఉన్నత చదువులకు అవసరమయ్యే మొత్తంలో 90% రుణాలు ఇస్తున్నాయి. మీరు మీ విద్యలో రాణిస్తున్నారా.. ఉన్నత చదువులు పూర్తిచేసే అంకితభావంతో ఉన్నారా.. యూనివర్సిటీలో మీరు అడ్మిషన్లు పొందారా? వంటి అనేక విషయాలు తెలుసుకున్న తర్వాతే బ్యాంకులు ఈ లోన్‌లు అందజేస్తున్నాయి. అలాగే ఈ లోన్లు పొందేందుకు 18 ఏళ్లు నిండి ఉండాలి.. భారత పౌరులై ఉండాలి.

లోన్ తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉండటం:

రూ .4 లక్షల వరకు విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. ఇల్లు లేదా కారు వంటి తనఖాలు హామీగా/ సెక్యూరిటీగా చూపించాల్సిన అవసరం లేదు. కానీ మీరు తీసుకోవాల్సిన లోన్ మొత్తం రూ.4 నుంచి రూ.7.5 లక్షల మధ్య ఉంటే.. అప్పుడు సహ-దరఖాస్తుదారులు అవసరమవుతారు. విద్యార్థులకు సంపాదన ఉండదు కాబట్టి వారి తరఫున రుణాన్ని చెల్లించడంలో సహాయపడే సహ-దరఖాస్తుదారులు ఉండటం ముఖ్యం. అధిక రుణాలు అందించేందుకు బ్యాంకులు.. విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వాములలో ఎవరినో ఒకరిని సహ-దరఖాస్తుదారునిగా ఎంచుకుంటాయి. సహ-దరఖాస్తుదారులకు స్థిరమైన ఉద్యోగం ఉందా.. వారు తిరిగి రుణం చెల్లించగలరా అనే విషయాలు తెలుసుకున్న తర్వాతే రుణాలను అందజేస్తాయి.

వడ్డీ రేట్లు & మారటోరియం:

చెల్లింపులకు ఎక్కువ కాలం పొందేలా రుణాలను తీసుకోవడం చాలా అవసరం. త్వరగా చెల్లించాల్సిన రుణం తీసుకోవడం వల్ల విద్యార్థులపై భారం పెరుగుతుంది. అలాగే మంచి మారటోరియం వ్యవధి ఉన్న బ్యాంక్‌ని ఎంచుకోవాలి.

ప్రభుత్వ పథకాలు:

విద్యార్థులు బ్యాంకులతో పాటు భారత ప్రభుత్వ పథకం ద్వారా కూడా రుణాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, భారత ప్రభుత్వం విద్యా రుణాల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్ (CGFSEL) ను ప్రారంభించింది. ఈ పథకం కింద సహ-దరఖాస్తుదారులు లేకుండానే విద్యార్థులు రూ.7.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80E కింద విద్యారుణంపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపులు ఉన్నాయి. అలాగే చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి విద్యార్థులు సరైన విద్యా రుణం తీసుకోవచ్చు.
Published by:John Naveen Kora
First published: