ఉన్నత విద్య అభ్యసించడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. అన్ని బ్యాంకులు విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంటాయి. పిల్లల పైచదువుల కోసం ఖర్చు చేసేందుకు చేతిలో డబ్బులు లేని తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఓ వరం అనే చెప్పాలి. పిల్లల విద్యాభ్యాసం పూర్తై ఉద్యోగంలో చేరిన తర్వాత రుణాలు తిరిగి చెల్లించొచ్చు. ఉద్యోగంలో చేరేవరకు ఈఎంఐ చెల్లించాలన్న టెన్షన్ ఉండదు. భారతదేశంలో ఉన్నతవిద్య అభ్యసించడం కోసం మాత్రమే కాదు విదేశాల్లో చదివే విద్యార్థులకూ బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంటాయి. ఎడ్యుకేషన్ లోన్ తల్లిదండ్రులైనా తీసుకోవచ్చు. లేదా పిల్లలు తీసుకోవచ్చు. అయితే ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు చెక్ చేసుకోవడం అవసరం. వడ్డీ రేట్లు వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్రస్తుతం ఈ వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి 15.50 శాతం వరకు ఉన్నాయి. వడ్డీ రేట్లు మాత్రమే కాదు లోన్ ఈఎంఐ చెల్లింపులు, ఇతర నియమ నిబంధనలు కూడా వేర్వేరుగా ఉంటాయి. మరి ఏ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్‌పై ఎంత వడ్డీ ఉందో తెలుసుకోండి.
Job Mela in Vijayawada: మొత్తం 800 ఉద్యోగాల భర్తీకి విజయవాడలో ఇంటర్వ్యూలు... యువతులకు మాత్రమే
GMH Tirupati Recruitment 2021: తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.75 శాతం
యూనియన్ బ్యాంక్- 6.80 శాతం
సెంట్రల్ బ్యాంక్- 6.85 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 6.90 శాతం
ఐడీబీఐ బ్యాంక్- 6.90 శాతం
కెనెరా బ్యాంక్- 6.90 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.05 శాతం
ఇండియన్ బ్యాంక్- 7.15 శాతం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 7.25 శాతం
యూకో బ్యాంక్- 7.30 శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్- 7.70 శాతం
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్- 8.30 శాతం
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్- 8.70 శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 9.55 శాతం
యాక్సిస్ బ్యాంక్- 9.70 శాతం
ఫెడరల్ బ్యాంక్- 10.05 శాతం
ధనలక్ష్మి బ్యాంక్- 10.50 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్- 10.50 శాతం
కరూర్ వైశ్య బ్యాంక్- 10.75 శాతం
కర్నాటక బ్యాంక్- 12.19 శాతం
సిటీ యూనియన్ బ్యాంక్- 15.50 శాతం
Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించాలా? ఈ 10 ఐడియాలు మీకోసమే
BRO Recruitment 2021: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 జాబ్స్
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్‌లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే 9 శాతం పైనే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ఎడ్యుకేషన్ లోన్‌కు అప్లై చేయాలంటే విద్యాసంస్థలో అడ్మిషన్ స్టేట్‌మెంట్, మార్క్స్ షీట్, ఏజ్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, విద్యార్థులు ఉద్యోగం చేస్తున్నట్టైతే చివరి మూడు నెలల పే స్లిప్స్, ఆరు నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, విదేశాల్లో చదువుకోవాలంటే వీసా లాంటివి బ్యాంకుకు సబ్మిట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, CAREER, EDUCATION, JOBS