Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా? మీరు ఈ తప్పులు చేయొద్దు

Army Recruitment Rally | ఒకవేళ మీరు కూడా ఆర్మీ ఉద్యోగాలకు, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు దరఖాస్తు చేస్తున్నట్టైతే ఈ తప్పులు చేయొద్దు. దళారుల మాటలు నమ్మి వారి వలలో పడితే డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు, పోలీసు కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది.

news18-telugu
Updated: September 20, 2019, 10:43 AM IST
Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా? మీరు ఈ తప్పులు చేయొద్దు
Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా? మీరు ఈ తప్పులు చేయొద్దు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 20, 2019, 10:43 AM IST
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కరీంనగర్‌లో కూడా అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఇక దేశంలోని వేర్వేరు ప్యాంతాల్లో రిక్రూట్‌మెంట్ ర్యాలీలను నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఈ ర్యాలీలకు వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయితే అర్హతలు లేకపోయినా ఉద్యోగం సంపాదించాలన్న దురాశతో నిరుద్యోగులు కొందరు తప్పులు చేస్తున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బారాక్‌పోర్‌లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సుమారు 20,000 దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 50 మంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో వచ్చారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్-ARO నకిలీ సర్టిఫికెట్లను చూసి అప్రమత్తమైంది.

50 మంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొచ్చారు. వారంతా ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్కూల్ కాలేజీ సర్టిఫికెట్లు, చివరకు బర్త్ సర్టిఫికెట్లు కూడా నకిలీవే. కొందరు దళారులు ఆర్మీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు వల వేస్తున్నారు. అందుకే ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ఆర్మీ ప్రకటన


Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... మొదలైన దరఖాస్తు



రిక్రూటింగ్ అధికారి కల్నల్ ఎస్ హేమంత్ నాథ్ బారాక్‌పోర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో పాటు అభ్యర్థుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ డాక్యుమెంట్లు సంపాదించడానికి ఏజెంట్లకు రూ.2,000 నుంచి రూ.25,000 వరకు చెల్లించినట్టు అభ్యర్థులు పోలీసులకు తెలిపారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయితే రూ.2,00,000 నుంచి రూ.4,00,000 వరకు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు చెప్పారు.

ఒకవేళ మీరు కూడా ఆర్మీ ఉద్యోగాలకు, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు దరఖాస్తు చేస్తున్నట్టైతే ఈ తప్పులు చేయొద్దు. దళారుల మాటలు నమ్మి వారి వలలో పడితే డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు, పోలీసు కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇక ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా కేసులు వెంటాడుతూ ఉంటాయి. ఆర్మీ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ఇండియన్ ఆర్మీ నేరుగా చేస్తుంది. ఆర్మీ అధికారిక వెబ్‌సైట్లలోనే నోటిఫికేషన్లు ఉంటాయి. వాటి ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు.

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి
Loading...

ఇవి కూడా చదవండి:

RITES Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...