హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bhadradri Kothagudem: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌కు హాజరవుతున్నారా.. ఇవి పాటించండి

Bhadradri Kothagudem: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌కు హాజరవుతున్నారా.. ఇవి పాటించండి

ఫిజికల్ టెస్ట్ కు టిప్స్

ఫిజికల్ టెస్ట్ కు టిప్స్

Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 3వరకు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Kranthi Kumar, News 18, Bhadradri

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 3వరకు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఆయా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని ఖచ్చితమైన సూచనలు పాటించాల్సిందే మరి. కాగా ఆయా అభ్యర్ధులకు సంబంధించి నిర్వహించనున్న పరీక్షల సమయాలు, సూచనలపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.

ఫిజికల్ టెస్ట్ కు హాజరు కాబోయే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు..

>అడ్మిట్ కార్డు/ఇంటిమేషన్ లెటర్ అభ్యర్థి సంతకం చేసిన పార్ట్ -2 అప్లికేషన్ ప్రింట్ | అవుట్ తీసుకుని రావాలి.

>అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సమయంలో, తేదీల్లో రిపోర్టింగ్ చేయాలి. సమయపాలన పాటించాలి.

>అభ్యర్థులు ఉదయం 5 గంటలకే పరేడ్ మైదానానికి చేరుకోవాలి.

>వేదిక వద్దకు చేరుకున్న అభ్యర్థులకు డాక్యుమెంట్ పరిశీలన, బయోమెట్రిక్ తర్వాత దేహదారుఢ్య పరీక్షలలో ఒకరి స్థానంలో మరొకరు పాల్గొనే అవకాశం లేకుండా ఉండేందుకు ప్రతి అభ్యర్థి చేతికి చిప్తో కూడిన రిస్ట్బ్యండ్, డిజిటల్ చిప్స్ తో కూడిన ఆర్ఎఫ్ఎస్ఐడీ జాకెట్ అటాచ్ చేస్తారు.

>రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తో స్వీయ ధ్రువీకరణ ఫొటో కాపీ సమర్పించాలి.

>దళారుల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దు. అలాంటి వారి సమాచారం ఉంటే పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి.

>అభ్యర్థులు తమ పరీక్ష తేదీకి కనీసం ఒకరోజు ముందుగా పీఎంటీ, పీఈటీ వేదికను సందర్శించి వేదిక చిరునామా, స్థానం నిర్ధారించుకోవాలి.

>వేదిక వద్దకు అనవసరమైన వ్యక్తిగత వస్తువులు తీసుకుని రావద్దు.

>మహిళా అభ్యర్థులు అభరణాలు ధరించి హాజరుకావొద్దు. హ్యాండ్ బ్యాగ్లు, జోలాలు, పౌచ్ లు వంటివి ధరించి పరీక్షలకు హాజరుకావొవద్దు. అభ్యర్థులు విలువైన వస్తువులు భద్రపరుచుకునేందుకు ఎలాంటి లాక్ , స్టోరేజీ రూంలు సౌకర్యం లేదు. గ్రౌండ్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు.

>అభ్యర్థులు పీఎంటీ/పీఈటీ చేయించుకోవడానికి ముందు టీఎస్సీఆర్బీ వద్ద అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ డేటా ఆధారంగా గుర్తింపు ధ్రువీకరణ ఉంటుంది. >అభ్యర్థులు తమ వేళ్లపై మెహందీ, తాత్కా లిక పచ్చబొట్లు వంటివి బయోమెట్రిక్ ధ్రువీకరణకు ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదు.

>ఎక్స్ సర్వీస్మెన్(పీపీవో/ డిశ్చార్జ్ బుక్) ఫోటో కాపీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాలి.

>ఎజెన్సీ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు స్వీయ ధ్రువీకరించిన ఫొటో కాపీ, ఆదివాసుల సర్టిఫికేట్ జీవో నెం. 24 గిరిజన సంక్షేమం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఎస్టీ సర్టిఫికెట్ ను అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది.

*ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లో అభ్యర్థులకు లక్ష్యాలు.

-పరుగు పరిక్ష

పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 07:15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో అయితే అభ్యర్థులు 1600 మీటర్లు దూరాన్ని 09:30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇకమహిళా అభ్యర్థులు అయితే 800మీటర్ల దూరాన్ని 05:20 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి.

-లాంగ్ జంప్ పరిక్ష

పురుషు అభ్యర్థులు 4 మీటర్లు, ఎక్స్ సర్వస్మిన్ అభ్యర్థులు 3.50 మీటర్లు, మహిళలు 2.50 మీటర్లలక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది.

-షార్ట్ పుట్

పురుషు అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 7.26 కిలోలు బరువును 08 మీటర్లుమహిళల అభ్యర్థులు 4 కిలోల బరువును 04 మీటర్లుకు విసరాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులో ఓసీ, బీసీ పురుష అభ్యర్థులు 167.6 సెం.మీ, మహిళా అభ్యర్థులు 152.5 ఎస్టీ పురుష అభ్యర్థులు 160 సెం.మీ, మహిళలు 150 సెం. మీ కంటే ఎక్కువ ఎత్తు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు