Home /News /jobs /

ARE YOU AIMING FOR A BANK JOB BUT IF YOU PREPARE LIKE THIS YOU WILL GET A JOB UMG GH

IBPS Clerk Exam: మీరు బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా సిద్దం అవుతున్నారా? ఇలా ప్రిపేర్ అయ్యారంటే అలా జాబ్ వచ్చేస్తుంది !

 మీరు బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా సిద్దం అవుతున్నారా? అయితే ఇలా ప్రిపేర్ అయ్యారంటే అలా జాబ్ వచ్చేస్తుంది !

మీరు బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా సిద్దం అవుతున్నారా? అయితే ఇలా ప్రిపేర్ అయ్యారంటే అలా జాబ్ వచ్చేస్తుంది !

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ ఏడాది భారీగా పోస్టులను భర్తీ చేస్తోంది. IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్ట్ 28, సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో జరగనుంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ ఏడాది భారీగా ఉద్యోగాల(Jobs)ను ను భర్తీ చేస్తోంది. ఇటీవలే ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), ఆర్ఆర్‌బీ (RRB), క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) వంటి ఆన్‌లైన్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, వివిధ బ్యాంక్ పరీక్షలు ఆగస్ట్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు పరీక్షలు జరుగుతాయి. IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష మాత్రం ఆగస్ట్ 28, సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో జరగనుంది. ఈ ఏడాది 6,035 క్లర్క్‌ల ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ (Recruitment) నోటిఫికేషన్‌ను IBPS బ్యాంక్ విడుదల చేసింది. ఈ పరీక్షలకు ఇంకా నెల రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ సమయంలో స్ట్రాటజీలు, టిప్స్ (Exam Tips) పాటించడం ముఖ్యం. నిపుణుల ప్రకారం, కొన్ని టిప్స్ ఫాలో అవుతే జాబ్ రావటం దాదాపు ఖాయమే! ఆ విలువైన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక స్టడీ ప్లాన్ ముఖ్యం
పరీక్షకు సన్నద్ధమయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక మంచి స్టడీ ప్లాన్ ఉండటం అవసరం. ఎంత సిలబస్‌ని కవర్ చేశాం? ఇంకా ఎంత సిలబస్(Syllabus) మిగిలి ఉంది? అనేది స్పష్టంగా తెలుసుకోవడానికి ఒక స్టడీ ప్లాన్ కావాలి. ఏ టాపిక్స్ ఎక్కువ చదవాలి? ఏవి ముందు చదవాలి? అనేది ముందుగానే నిర్ణయించుకుంటే ప్రిపేర్ కావడం ఈజీ అవుతుంది.

పరీక్షలు, క్విజ్‌లపై ఎక్కువ ఫోకస్
పరీక్షలో ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇవ్వడం చాలా ముఖ్యం. అభ్యర్థులు తరచుగా ఆబ్జెక్టివ్ పరీక్షలు, క్విజ్‌లను క్రమం తప్పకుండా రాస్తూ తమ వేగాన్ని పరీక్షించుకోవాలి. టెస్ట్ సిరీస్/క్విజ్‌లు ప్రాక్టీస్‌ చేస్తూ అభ్యర్థులు తమ వేగాన్ని పెంచుకోవచ్చు. తద్వారా పరీక్ష సరళి ఎలా ఉంటుందనేది కూడా తెలుస్తుంది. అలానే పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు తక్కువ సమయంలో సమాధానాలు ఇవ్వొచ్చు.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


టైమ్‌ మేనేజ్‌మెంట్ కీలకం
IBPS పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంతో పాటు పరీక్ష రాస్తున్న సమయంలోనూ టైమ్‌ మేనేజ్‌మెంట్ కీలక అంశంగా మారుతుంది. ఎగ్జామ్‌కి సిద్ధమవుతున్నప్పుడు ప్రతి సబ్జెక్ట్, సెక్షన్‌కి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. ట్రిక్కీగా, హార్డ్‌గా ఉండే సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. పరీక్ష రాసేటప్పుడు ప్రతి సెక్షన్‌కి నిర్దిష్ట సమయం సెట్ చేసుకొని ఎక్కువ ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి.

సందేహాలు నివృత్తి
పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం అత్యావశ్యకం. నిపుణుల ప్రకారం, ఒక ముఖ్యమైన సబ్జెక్టును బాగా అర్థం చేసుకోవడానికి, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ బాగా గుర్తుంచుకోవడానికి ప్రిపరేషన్ మధ్యలో తలెత్తే అన్ని సందేహాలను క్లియర్ చేసుకోవాలి. ఇందుకు ఒక టీచర్ లేదా మెంటార్ సహాయం తీసుకోవచ్చు.


రివిజన్ కోసం తగిన సమయం కేటాయించాలి
సరైన రివిజన్ లేని ప్రిపరేషన్ వల్ల ఉపయోగమేమీ ఉండదు. అందుకే బాగా రివిజన్ చేయాలి. ముఖ్యమైన అంశాలను ఒకటికి రెండు సార్లు రివైజ్ చేయాలి. అప్పుడే పరీక్ష రాసేటప్పుడు చదివినవన్నీ గుర్తుకొస్తాయి. సరళంగా చెప్పాలంటే, ఎంత ఎక్కువ రివైజ్ చేస్తే, అంత చక్కగా ఎగ్జామ్ రాయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Bank Jobs, IBPS, Ibps rrb, JOBS

తదుపరి వార్తలు