కాంపిటేటివ్ పరీక్షలకు(Competitive Exam) ప్రిపేర్ అవుతున్న చాలామందికి మ్యాథ్స్ అంటే భయపడుతుంటారు. ఏ పరీక్ష చూసినా.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ విభాగాలు ఉంటాయి. వీటి నుంచి గ్రూప్స్ 1, 2, 3 లాంటి పరీక్షలైతే.. 20 నుంచి 30 వరకు మార్కులు వస్తాయి. గ్రూఫ్ 4లో అయితే.. సెకండ్ పేపర్ అంతా.. వీటి నుంచే ప్రశ్నలు అడుగుతారు. 150 మార్కులకు సెక్రటేరియల్ ఎబిటిటీ ఉంటుంది. ఇక మిగిలిన పరీక్షలల్లో కూడా వీటిపై ప్రశ్నలు అడుగుతారు. అయితే మొదటి నుంచి కూడా మ్యాథ్స్(Maths) అంటే కొందరికి భయం ఉంటుంది. పదో తరగతి తర్వాత ఆ భయం కారణంగానే చాలామంది ఎంపీసీ కాకుండా.. బైపీసీ, సీఈసీ లాంటి కోర్సులు తీసుకుంటూ ఉంటారు. మ్యాథ్స్ స్టూడెంట్స్ కు అయితే.. వీటి ద్వారా ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కానీ.. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్(Students) అది కాస్త కష్టమైన పని. అయితే ఇక్కడ మ్యాథ్స్ లో ఉన్న భయం పోవాలన్నా.. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నా.. ఇక్కడ చెప్పే కొన్ని ట్రిక్స్ పాటించండి.
1. ముందుగా అభ్యర్థులు 20 వరకు టేబుల్స్ (ఎక్కాలు) పూర్తిగా నేర్చుకోవాలి. నిద్రలో అడిగినా చెప్పే విధంగా ఉండాలి. క్యాలిక్యూలేషన్ లో ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. మ్యాథ్స్ లెక్కలు స్పీడ్ గా చేయడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
2. ఇక దీంతో పాటు.. 50 వరకు వర్గాలు నేర్చుకోవాలి. అందరు ఎక్కువగా 20 వరకు స్వ్కేర్స్ నేర్చుకుంటారు.. అయితే.. 50వరకు నేర్చుకుంటే.. లెక్కలు పాస్ట్ గా చేయడానికి ఉపయోగపడతాయి.
3. ఇక చివరగా.. క్యూబ్స్ కూడా 20వరకు పూర్తిగా నేర్చుకోవాలి. ఇలా వీటిని ప్రాథమికంగా నేర్చుకుంటే.. Simplifications లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంలో ఉపయోగపడతాయి.
4. ఇక అన్నింటికంటే.. ప్రతీ రోజు సాధన చేయడం అనేది ముఖ్యం. ఒక సబ్జెక్టు కు సంబంధించి అన్ని విషయాలు.. అన్ని మోడల్స్ కు సంబంధించి ప్రశ్నలు నేర్చుకున్న తర్వాత.. దానిపై సాధన చేయడం ద్వారా.. మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇక గ్రూప్ 4 ఉద్యోగాల విషయానికి వస్తే.. మొత్తం 2 పేపర్లు ఉంటాయి. దీనిలో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ కు సంబంధించి ఉంటుంది. రెండో పేపర్ మొత్తం సెక్రటేరియల్ ఎబిలిటీలో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ తో పాటు.. ఇంగ్లీష్ Passages, జంబ్లింగ్ సెంటెన్సెస్ అడుతాడు. వీటికి సంబంధించి ఎక్కువ మోడల్ పేపర్లను సాధన చేయడం ద్వారా గ్రూప్ 4 ఉద్యోగాన్ని సాధించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS