Home /News /jobs /

ARE THERE ANY OBJECTIONS ON CBSE CLASS 12 TERM 1 RESULTS COMPLAIN LIKE THIS GH VB

CBSE 12th CLASS: సీబీఎస్‌ఈ 12వ తరగతి టర్మ్1 ఫలితాలపై అభ్యంతరాలు ఉన్నాయా..? ఇలా ఫిర్యాదు చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12వ తరగతి టర్మ్ 1 ఫలితాలను మార్చి19న ప్రకటించింది. ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రివెన్స్‌ను ఏర్పాటు చేసింది. బోర్డు అధికారిక పోర్టల్‌ లేదా పాఠశాలల్లోనూ విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు.

ఇంకా చదవండి ...
CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12వ తరగతి టర్మ్ 1 ఫలితాలను మార్చి19న ప్రకటించింది. సంబంధిత స్కూళ్లలో మార్క్ షీట్లను తనిఖీ చేసుకోవాలని సూచించింది. అలాగే 10వ తరగతి మాదిరిగా ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రివెన్స్‌ను ఏర్పాటు చేసింది. బోర్డు అధికారిక పోర్టల్‌(Portal) లేదా పాఠశాలల్లోనూ విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కార ఫారంను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చింది సీబీఎస్‌ఈ(CBSE). పరీక్షల ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ముందుగా స్కూల్ యాజమాన్యాలకు విద్యార్థులు ఫిర్యాదుల ఫారంను ముందుగా పంపాల్సి ఉంటుంది. అటు నుంచి అది బోర్డుకు చేరనుంది. ఆన్‌లైన్‌లోనూ(Online) విద్యార్థులు తమ సందేహాలను బోర్డుకు తెలపవచ్చు. ఈ సదుపాయం మార్చి 31 వరకు అందుబాటులో ఉండనుంది. అయితే టర్మ్ 2(Term 2) ఫలితాల ప్రకటన తర్వాత వెరిఫికేషన్‌ షెడ్యూల్‌తో పాటు ఆన్‌లైన్ ఫిర్యాదులను పరిష్కరిస్తామని బోర్డు ప్రకటించింది.

LIC Recruitment 2022: టెన్త్ పాసైనవారికి ఎల్ఐసీలో జాబ్స్... త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

అభ్యంతరాలపై ఇలా ఫిర్యాదు చేయండి

స్టెప్1: ముందుగా సీబీఈఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్లు cbsenic.in or cbseresults.nic.inను సందర్శించాలి.

స్టెప్2: హోమ్ పేజీలో ‘school request submission for resolution’ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్3: మీ ప్రాధాన్యతను బట్టి ‘continue as school’ లేదా ‘continue as RO/JS’ పై క్లిక్ చేయండి.

స్టెప్4: మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వంటి అవసరమైన వాటిని ఉపయోగించి లాగిన్ అవ్వండి.

స్టెప్5: చివరగా మీ ఫిర్యాదును సబ్‌మిట్ చేయండి.

టర్మ్ 1 ఫలితాల మార్కులను CBSE బోర్డు నేరుగా పాఠశాలలకు పంపింది. ప్రస్తుతం స్కూళ్ల యాజమాన్యాలు థియరీ మార్కులకు ప్రాక్టికల్ మార్కులను కలిపే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో టర్మ్1 తుది ఫలితాల్లో థియరీ+ ప్రాక్టికల్స్ మార్కులు కలిసి ఉంటాయి. టాపర్లకు 100 శాతం లేదా 40కి 40 మార్కులు వచ్చాయి.

టర్మ్1 ఫలితాలపై సీబీఎస్‌ఈ అధికారి ఒకరు స్పందించారు. 12వ తరగతి టర్మ్ 1 ఫలితాలను స్కూళ్లకు పంపించామని... విద్యార్థులు సంబంధిత స్కూళ్ల యాజమాన్యాలను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రశ్న పత్రాలు లేదా ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నివేదించాలని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటామని బోర్డు అధికారిక ప్రకటన జారీ చేసింది. దీంతో రివైజ్డ్ ఆన్సర్ కీ ఆధారంగా మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. కాగా, 12వ తరగతి టర్మ్1 ఫలితాలతో సంబంధం లేకుండా ఏప్రిల్26 నుంచి ప్రారంభం కానున్న టర్మ్2 పరీక్షలకు విద్యార్థులు హాజరుకానున్నారు. టర్మ్2 పరీక్షలు సబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. జూన్15న పరీక్షలు ముగియనున్నాయి.

Jobs in Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో 135 జాబ్స్.. నెలకు రూ.లక్షకు పైగా వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

ఇక, మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (MPBSE) విషయానికి వస్తే 10, 12వ తరగతుల పరీక్షల మూల్యాంకన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మార్చి 6 నుండి ప్రారంభమైంది. దీంతో ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పరీక్షలకు 18 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మూల్యాంకన ప్రక్రియలో దాదాపు 30,000 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు mpresults.nic.in, mpbse.nic.inలో అందుబాటులో ఉండనున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CBSE

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు