ఇటీవలే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పదో తరగతి ఫలితాలు (AP 10th Exams Results) విడుదలయ్యాయి. సాధారంగా టెన్త్ తర్వాత ఎక్కువ మంది ఇంటర్ చదువుతారు. మరికొందరు మాత్రం డిఫెన్స్ వైపు అడుగులు వేస్తారు. NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో చదవాలని అనుకుంటారు. మీరు కూడా అలానే ఆలోచిస్తున్నట్లయితే... ఈ వార్త మీకోసమే. నాసిక్‌లోని భోస్లా మిలిటరీ కాలేజీ (Bhonsala Military College Nashik)లో NDA ప్రిపరేషన్ బ్యాచ్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బ్యాచ్‌లో ప్రవేశానికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై 11వ తరతగతి సైన్స్‌లో ప్రవేశం పొందాలనుకుంటే.. మీరు కాలేజీ చదువులతో పాటే ఎన్‌డిఎకు సిద్ధం కావచ్చు.
ఫీజు ఎంత? ఎంత మంది విద్యార్థులను చేర్చుకుంటారు?
ఎన్డీఏ ప్రిపరేషన్ బ్యాచ్‌కి ఏడాది ఫీజు రూ.1 లక్షా 95 వేలు. ఇందులోనే అడ్మిషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కలిపి ఉంటాయి. ఈ ఫీజులోనే కళాశాల నుంచి కావలనవన్నీ ఏడాది పొడువునా మీకు లభిస్తాయి. ఈ కోర్సుకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. అన్ని ఎంట్రీలు ఓపెన్‌లో జరుగుతాయి. మొత్తం 120 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
అడ్మిషన్ ఎలిజిబిలిటీ
NDA ప్రిపరేషన్ బ్యాచ్‌లో అడ్మిషన్ పొందడానికి మీకు 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయన్నది ముఖ్యం కాదు. ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా.. వాటిని పరిగణలోకి తీసుకోరు. భోస్లా మిలిటరీ కళాశాలలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఎన్డీయేలో అడిగే ప్రశ్నలు ఉంటాయి. ఆ పరీక్షలో వచ్చిన పాయింట్ల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు.
ఫిజికల్, మెడికల్ క్వాలిఫికేషన్ వైద్య అర్హత
1విద్యార్థికి అన్ని సబ్జెక్టులపై అవగాహన ఉందా లేదా అని ప్రవేశ పరీక్ష ద్వారా ధృవీకరించుకుంటారు.
2) విద్యార్థి స్పష్టంగా ఎలా మాట్లాడతాడు? నిజంగానే ఎన్డీయేలోకి వెళ్లాలనుకుంటున్నారా? ఈ విషయాలను ఇంటర్వ్యూలో పరిశీలిస్తున్నారు.
3)ఆర్మీలో అభ్యర్థులందరికీ ఫిజికల్ టెస్ట్ చేశారు. అచ్చం అలాగే ఇక్కడ కూడా ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. విద్యార్థి శారీరకంగా దృఢంగా ఉన్నాడా లేదా అని ధృవీకరించుకుటారు. .ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎంపికైన విద్యార్థులకు భోస్లా మిలిటరీ కాలేజీలో అడ్మిషన్ ఇస్తారు.
అగ్నిపథ్ స్కీమ్‌లో మరో అప్డేట్.. ఈసారి ఎన్‌సీసీ క్యాడెట్స్‌కి గోల్డెన్ ఛాన్సే..!
దరఖాస్తు ఎలా?
భోసాల మిలిటరీ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే... ముందుగా bmc.bhonsala.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ మీ పేరును నమోదు చేసి, మెరిట్ ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. అనంతరం ప్రవేశ పరీక్ష కోసం కాలేజీ వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. అడ్మిషన్ గురించి మీకేమైనా సందేహాలు ఉంటే.. మేజర్ విక్రాంత్ కవ్లే మేజర్ (ఫోన్ నెం. 9890901079), కర్నల్ రామ్ కుమార్ నాయక్ (ఫోన్ నెం. 9423163648)ని సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం డాక్టర్ ముంజే మార్గ్, రాంభూమి సమర్థ్ నగర్, మోడల్ కాలనీ, నాసిక్ అడ్రస్‌లో కాంటాక్ట్ చేయవచ్చు.
విద్యార్థులకు వసతి
విద్యార్థి కళాశాలకు చేరుకున్న తర్వాత.. వారికి అన్ని రకాల పుస్తకాలు, ఇతర వస్తువులను అందిస్తారు. కాలేజీకి కావాల్సిన మెటీరియల్‌ని సొంతంగా సేకరించాల్సిన అవసరం లేదు. మీరు చెల్లించే ఫీజులోనే వీటన్నింటిని ఇస్తారు.
విద్యార్థుల దినచర్య
ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు విద్యార్థులకు సైనిక శిక్షణ ఇస్తారు. ఇందులో గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, ఫైరింగ్, యోగా, కరాటే, మల్కాంబ్ వంటివి ఉంటాయి. ఈ అంశాల్లో ప్రతిదానికీ ప్రత్యేక గైడ్‌లు ఉంటారు. సైనిక శిక్షణ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం విద్యార్థులందరూ హాస్టల్ నుంచి కాలేజీకి వెళతారు. NDA తరగతులు వెంటనే ప్రారంభమవుతాయి. క్లాస్ పూర్తైన తర్వాత.. భోజనం చేయడానికి సమయం ఇస్తారు. భోజనం అనంతరం విద్యార్థులు మళ్లీ కాలేజీకి తిరిగి వస్తారు.
తెలంగాణ ఐసెట్ లో మంచి స్కోర్ చేయడం ఎలా?.. ఈ టిప్స్ పాటిస్తే సాధ్యమే.. తెలుసుకోండి
మార్గనిర్దేశం చేసేది ఎవరు?
హాస్టళ్లలోని విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు భోస్లా మిలటరీ కాలేజీలో రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అందుబాటులో ఉంటారు. సైన్యంలో చేరేలా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతారు. ప్రస్తుతం సైన్యలో పనిచేస్తున్న .. భోస్లా మిలిటరీ కళాశాల పూర్వ విద్యార్థులు కూడా విద్యార్థఉలకు సలహాలు సూచనలు ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Defense, EDUCATION, Indian Military, JOBS, Maharashtra