హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Andhra Pradesh: విశాఖ‌ప‌ట్నం జిల్లా ఆస్ప‌త్రిలో 126 ఉద్యోగాలు.. జీతం రూ.28,000

Jobs in Andhra Pradesh: విశాఖ‌ప‌ట్నం జిల్లా ఆస్ప‌త్రిలో 126 ఉద్యోగాలు.. జీతం రూ.28,000

ఏపీవీవీపీలో ఉద్యోగాలు

ఏపీవీవీపీలో ఉద్యోగాలు

APVVP Recruitment: ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్‌కు చెందిన విశాఖ‌ప‌ట్నం జిల్లా ఆస్ప‌త్రుల్లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 126 ఔట్‌సోర్సింగ్‌/ కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిన ప‌లు విభాగాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్‌కు చెందిన విశాఖ‌ప‌ట్నం జిల్లా ఆస్ప‌త్రుల్లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 126 ఔట్‌సోర్సింగ్‌/ కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిన ప‌లు విభాగాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ.12,000 నుంచి రూ.28,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. ఈ పోస్టుల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ (Offline) ద్వారా ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు అప్లై చేసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 29, 2021 ఆఖ‌రుత తేదీ. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు సంబంధించిన వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్ సైట్ https://visakhapatnam.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

  పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు

  పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌
  ల్యాబ్ టెక్నీషియన్24గుర్తింపు పొందిన యూనిర్సిటీలో డీఎంఎల్‌టీ/ బీఎస్సీ.ఎంఎల్‌టీ లేద త‌త్స‌మ అర్హ‌త క‌లిగిన కోర్సు చేసి ఉండాలి.
  ఫార్మసిస్ట్ GR-II22గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల ఫార్మా రంగంలో డిగ్రీ చేసి ఉండాలి.
  రేడియోగ్రాఫర్06గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో సీఆర్ఏ ప‌రీక్ష పాసై ఉండాలి.
  థియేటర్21ప‌దోత‌ర‌గ‌తి పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి.
  కౌన్సెలర్ (MSW01గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎంఏ సోషియాల‌జీ, బీఏ సోషియాల‌జీ త‌త్స‌మ అర్హ‌త‌తో కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  డైటీషియన్01ఫుడ్ న్యూట్రిషియ‌న్ కోర్సులో ఎంఎస్సీ లేదా బీఎస్సీ చేసి ఉండాలి.
  ఆప్తాల్మిక్04గుర్తింపు పొందిన బోర్డు ద్వారా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి.
  ఆడియోమెట్రీషియన్04గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో స్పీచ్ థెర‌పీకి సంబంధించిన డిగ్రీ చేసి ఉండాలి.
  ఫిజియోథెరపిస్ట్03గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫిజియో థెర‌పీ డిగ్రీ చేసి ఉండాలి.
  Jr.Asst/DEO14గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి.
  రికార్డ్ Asst/MRA07ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి.
  ఆఫ్.సబార్డినేట్10ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి.
  పోస్ట్ మార్టం అసిస్ట్08ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి.
  ల్యాబ్ అటెండెంట్01ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి.


  DCCB Recruitment 2021: గుంటూరు డీసీసీబీలో 67 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం


  ఎంపిక విధానం..

  - ద‌ర‌ఖాస్త చేసుకొన్న అభ్య‌ర్థి గ‌త అనుభ‌వం, మార్కుల‌ను ప‌రిశీలిస్తారు.

  - అనంత‌రం వారిని షార్ట్‌లిస్ట్ చేసి స‌ర్టిఫికెట్ వెరిఫై చేసి తుది ఎంపిక చేస్తారు.

  DCCB Recruitment 2021: విజ‌య‌న‌గ‌రం డీసీసీబీలో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, జీతం వివ‌రాలు


  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.

  Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/document/vvp/ ను సంద‌ర్శించాలి.

  Step 3 :  అనంత‌ర నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 4 :  నోటిఫికేష‌న్ చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాం ఉంటుంది.

  Step 5 :  ద‌ర‌ఖాస్తును ప్రింట్ తీసుకొని త‌ప్పులు లేకుండా నింపాలి.

  Step 6 : అనంత‌రం అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను జ‌త చేసి.

  Dist. Coordinator of Hospital Services,

  in the premises of Govt. Hospital,

  Pendurthi, Visakhapatnam district అడ్ర‌స్‌కు పంపాలి.

  Step 7 :  ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Health department jobs, Job notification, JOBS

  ఉత్తమ కథలు