Home /News /jobs /

APSWREIS RECRUITMENT 2021 ONLINE APPLICATIONS INVITED FOR 46 PRINCIPAL TGT CARETAKER WARDEN POSTS NS

APSWREIS Recruitment 2021: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీ(గురుకులం)లో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీ APSWREIS నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రిన్సిపాల్/TGT/కేర్ టేకర్(వార్డెన్) విభాగాల్లో అధికారులు ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 16లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
  Andhra Pradesh: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు
  BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. మచిలీపట్నం బీఈఎల్ లో ఉద్యోగాలు.. వివరాలివే

  ముఖ్యమైన తేదీలు:
  అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం: జులై 22
  అప్లికేషన్లకు ఆఖరి తేదీ: ఆగస్టు 16

  ఖాళీల వివరాలు:
  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రిన్సిపాల్ గ్రేడ్ - 2 విభాగంలో 1 పోస్టు, TGT - 38, కేర్ టేకర్/వార్డెన్ విభాగంలో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  విద్యార్హతల వివరాలు:
  ప్రిన్సిపాల్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో పీజీ చేసి ఉండాలి. 50 శాతం మార్కులతో B.Ed చేసి ఉండాలి.
  TGT: పీజీ తో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు TET-2 పేపర్ పాసై ఉండాలి.
  కేర్ టేకర్/వార్డెన్- ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
  Notifications & Applications - Direct Link

  వేతనాలు వివరాలు:
  ప్రిన్సిపాల్ గ్రేడ్ - 2 విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ.40,270-రూ.93,780 వరకు వేతనం చెల్లించనున్నారు.
  టీజీటీ: ఈ విభాగంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 28,940-రూ.78,910 వరకు చెల్లించనున్నారు.
  కేర్ టేకర్/వార్డెన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,200 నుంచి రూ. 63,010 వరకు చెల్లించనున్నారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Government jobs, Job notification

  తదుపరి వార్తలు