హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూ్స్.. రేపే మెగాజాబ్ మేళా

AP Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూ్స్.. రేపే మెగాజాబ్ మేళా

శ్రీకాకుళంలో ఏపీఎస్ఎస్‌డీసీ జాబ్ మేళా

శ్రీకాకుళంలో ఏపీఎస్ఎస్‌డీసీ జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా (Srikakulam) లోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) వారి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam | Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లా (Srikakulam) లోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) వారి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఉదయం 09:00 గంటల నుండిజిల్లాలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేసారు. కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా, మొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చు అని తెలిపారు. జాబ్ మేళాలో 16 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని తెలిపారు.

1. సంస్థ పేరు: Premier Health Service

ఉద్యోగం: కేర్ టేకర్ నర్సింగ్

విద్యార్హత: ఇంటర్, డిగ్రీ, ఏ.ఎన్.ఎం జి.ఎన్.ఎమ్ నర్సింగ్

ఉద్యోగం చేయవలసిన ప్రదేశం: హైదరాబాద్

జెండర్: M/F

వయస్సు: 19-40 సంవత్సరాలు

ఖాళీల సంఖ్య: 40

వేతనం: నెలకు 13,000 వేల నుంచి 30,000 వరకు

2. సంస్థ పేరు: Hetero Lab's

ఉద్యోగం: జూనియర్ ఆఫీసర్

విద్యార్హత: బీ.ఎస్సీ కెమిస్ట్రీ / ఎమ్మెస్సీ కెమిస్ట్రీ

జెండర్: M

వయస్సు : 18 - 25 సంవత్సరాలు

ఖాళీల సంఖ్య: 60

వేతనం: నెలకు 23,000 నుంచి 26,000

ఉద్యోగం ప్రదేశం: హైదరాబాద్

ఇది చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈనెల 6న మెగా జాబ్ మేళా.. వివరాలివే..!

ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది. జిల్లాలోని యువతఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.

ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం:

గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్,శ్రీకాకుళం

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :

1.రాఘవ: 9182446325

2.వేణు: 8317652552

రిజిస్ట్రేషన్  కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయగలరు

http://rb.gy/tzt01n

First published:

Tags: Andhra Pradesh, APSSDC, Local News, Srikakulam

ఉత్తమ కథలు