హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈనెల 6న మెగా జాబ్ మేళా.. వివరాలివే..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈనెల 6న మెగా జాబ్ మేళా.. వివరాలివే..!

ఈనెల 6న కల్యాణదుర్గంలో జాబ్ మేళా

ఈనెల 6న కల్యాణదుర్గంలో జాబ్ మేళా

అనంతపురం జిల్లా (Anantapuram District) లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC & SEEDAP) ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

అనంతపురం జిల్లా (Anantapuram District) లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC & SEEDAP) ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 6వ తేదీ ఉదయం ఉదయం 09:00 గంటల నుండి కల్యాణదుర్గంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమామొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. జాబ్ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని తెలిపారు.ఎంపికయిన అభ్యర్థులకు ఉద్యోగస్థాయిని బట్టి జీతం రూ.10,000 వేల నుంచి 30 వేల రూపాయలు వరకు ఉంటుందని తెలిపారు.

1. సంస్థ పేరు :- TATA AIG & PAISABAZAR

ఉద్యోగం :- సిఎస్ఈ

విద్యార్హత :- ఇంటర్ ఆపై విద్యార్హత

ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- హైదరాబాద్ / బెంగళూరు

జెండర్ :- M/F

వయస్సు :-19-28 సంవత్సరాలు

ఖాళీల సంఖ్య :- 100

వేతనం :- నెలకు 13,000 వేల రూపాయలు నుంచి 20,000 వరకు

2. సంస్థ పేరు :- KIA MOTOR'S

ఉద్యోగ పాత్ర :- నిమ్ ట్రైనింగ్

విద్యార్హత :- డిప్లొమా /బి. టెక్ ( 2016/2022 )

జెండర్ :- M

వయస్సు :-18 - 25 సంవత్సరాలు

ఖాళీల సంఖ్య :- 100

వేతనం :- నెలకు 16,000

ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- పెనుకొండ, అనంతపురం

ఇది చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాలోనే జాబ్స్ .. వివరాలివే..!

ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది. జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.

ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం:-

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :-

1.8247885109

2.9550837679

3.7880202003

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, APSSDC, Kurnool, Local News

ఉత్తమ కథలు