Murali Krishna, News18, Kurnool
నంద్యాల జిల్లా (Nandyala District) లోని ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) చక్కటి ఆవకాశం కల్పిస్తోంది. ఈ నెల 31న నంద్యాలలోని ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ క్యాంపస్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యోగ కల్పన అధికారి సోమ శివారెడ్డి, రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని నిరుద్యోగులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు పదవ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా, మొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతహాజరు కావచ్చు అని తెలిపారు.
జాబ్ మేళా మేళాలో 3 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎంపికయిన ఉద్యోగ స్థాయిని బట్టి జీతం రూ.11,000 నుంచి రూ.16వేల వరకు ఉంటుందని తెలిపారు.
సంస్థ పేరు: గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్
ఈ సంస్థ నందు ఉద్యోగం చేయుటకు CNC మెసైన్ ఆపరేటర్ బీటెక్ మెకానికల్, డిప్లొమా, ఐటిఐ, పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఇందుకు ఎంపికైన వారికి జీతం నెలకు 11,500 నుంచి 13,000 వెల రూపాయల గౌరవ వేతనం ఉంటుందని తెలిపారు . ఈ సంస్థలో మొత్తం ఖాళీలు మొత్తం 150. ఈ సంస్థలో పనిచేయుటకు 25 సంవత్సరాలలోపు యువకులు మాత్రమే అర్హులు. ఎంపికైన వారు నాయుడుపేటలోఉద్యోగం చేయవలసి ఉంటుంది.
ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో పాటు ఫార్మల్ డ్రెస్ లో రావాల్సి ఉంటుంది.
ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం:
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల జిల్లా
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ :
1. 9533631002
2. 9440224291
రిజిస్ట్రేషన్ చేసుకోనుట కొరకు :
http://rb.gy/irtfcl
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, APSSDC, Job Mela, Kurnool, Local News