• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • APSSDC SKILL CONNECT DRIVE AT EAST GODAVARI DISTRICT FOR 250 JOBS IN VARIOUS COMPANIES NS

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు రేపే ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు రేపే ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా మరో సారి భారీగా ఉద్యోగాల భర్తీకి స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది. ఈ డ్రైవ్ ద్వారా మూడు కంపెనీల్లో మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో సారి భారీగా ఉద్యోగాల భర్తీకి స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది. ఈ డ్రైవ్ ద్వారా మూడు కంపెనీల్లో మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందు కోసం ఈ నెల 11న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఖాళీలు, విద్యార్హతలు..
    ఈ ప్రకటన ద్వారా Team Lease కంపెనీలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2016-2020లో పాస్ అయిన వారు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ఈస్ట్ గోదావరి జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. వారికి నెలకు రూ. 10 వేలను వేతనంగా చెల్లించనున్నారు.

    -Hero Moto Corp: ఈ కంపెనీలో 100 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.14,475 వేతనంతో పాటు రాయితీపై భోజనం, వసతి కల్పించనున్నారు. 18-30 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 2016-2020 మధ్య పాసై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులోని శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.

    -Flex India Pvt Ltd: ఈ కంపెనీలో ప్రొడక్షన్ ఆపరేటర్/Line Leader విభాగంలోనూ 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టెన్త్/ఇంటర్/డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఆయా పోస్టులకు అప్లై చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 14,500 వేతనం చెల్లించనున్నారు. దీంతో పాటు రాయితీపై భోజనం, వసతి కల్పిస్తారు. 2016-2020 మధ్య పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.



    అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు శ్రీ సంహిత డిగ్రీ కాలేజ్, నారాయణ స్కూల్ దగ్గర, శ్రీ విలాస్ వెంకటరెడ్డి స్ట్రీట్, ఈస్ట్ గోదావరి జిల్లా చిరునామాకు ఈ నెల 11 ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర ఏదైనా సందేహాలుంటే 7981364025, 9063648365 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు