APSSDC RELEASED JOB NOTICE WITH 150 VACANCIES IN TOLLPLUS INDIA PVT LTD AT HYDERABAD AND BANGALORE SS
Private Jobs: ఓ ప్రైవేట్ సంస్థలో 150 ఖాళీలు... APSSDC జాబ్ నోటీస్
ఓ ప్రైవేట్ సంస్థలో 150 ఖాళీలు... APSSDC జాబ్ నోటీస్
(ప్రతీకాత్మక చిత్రం)
APSSDC Jobs 2020 | ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసైనవారికి శుభవార్త. ప్రైవేట్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. APSSDC రిలీజ్ చేసిన ఓ జాబ్ నోటీస్ వివరాలు తెలుసుకోండి.
పలు ప్రైవేట్ సంస్థల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన జాబ్ నోటీసులను వరుసగా రిలీజ్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC. టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారికి ఉద్యోగావకశాలను అందిస్తోంది. ట్విట్టర్ ద్వారా ఈ జాబ్ నోటీసులను ప్రకటిస్తోంది. ఇప్పుడు మరో ప్రైవేట్ సంస్థలో ఉన్న ఖాళీల వివరాలను ట్విట్టర్లో వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC. అందులోని సమాచారం ప్రకారం టోల్ప్ల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 150 ఖాళీలున్నాయి. హైదరాబాద్, బెంగళూరులో ఈ ఖాళీలున్నాయి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. ఫ్రెషర్స్తో పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు. పురుషులతో పాటు మహిళలు అప్లై చేయొచ్చు. ఈ జాబ్ నోటీస్కు సంబంధించిన మరిన్ని వివరాలను APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో ఉన్న దరఖాస్తు లింక్ ద్వారా అప్లై చేయాలి.
భర్తీ చేసే పోస్టులు- బ్యాక్ ఆఫీస్ అసోసియేట్
మొత్తం ఖాళీలు- 150
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 20
విద్యార్హతలు- ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. ఇంజనీరింగ్ డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.
వేతనం- హైదరాబాద్లో నెలకు రూ.15,000. బెంగళూరులో నెలకు రూ.17,000.
పనివేళలు- రెగ్యులర్ డే షిఫ్ట్. వారానికి ఆరు రోజులు.
వయస్సు- 18 ఏళ్ల పైనే
ఇతర అర్హతలు- నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
జాబ్ లొకేషన్- హైదరాబాద్, బెంగళూరు
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్సైట్లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్కు కాల్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.