APSSDC Jobs: ప్రముఖ కంపెనీలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు మరో మూడు రోజులే గడువు

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏపీఎస్ఎస్డీసీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ అమర్ రాజా కంపెనీలో 100 ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ Amara Raja Batteries Ltd కంపెనీలో ఉద్యోగాలను భర్తీకి ఇంటర్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 08న పులివెందులలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో తెలిపారు. అయితే ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 06లోగా ఏపీఎస్ఎస్డీసీ అధికారిక వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.  కింద ఇచ్చిన లింక్ ద్వారా అభ్యర్థులు డైరెక్టుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే.. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
    Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే

    విద్యార్హతల వివరాలు..
    మిషన్ ఆపరేటర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 100 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. టెన్త్ పాస్, ఇంటర్ పాస్/ఫెయిల్, ఐటీఐ పాస్/ఫెయిల్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10500 వరకు వేతనం చెల్లించనున్నారు. దీంతో పాటు ఈఎస్, బస్, సబ్సిడీ హాస్టల్ సదుపాయాలను సైతం యాజమాన్యం అందించనుంది.



    ఇంటర్వ్యూ, ఇతర వివరాలు..
    ఈ ఉద్యోగాల భర్తీకి NAC Building, Kadiri-Jammalamadugu High way, pulivendula-516390 చిరునామాలో ఈ నెల 8న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే ఈ నెల 6లోగా అభ్యర్థులు https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర ఏమైనా సందేహాలుంటే వివరాల కోసం 9398348760 మొబైల్ నంబరును సంప్రదించాలని అధికారులు సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published: