హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో 100 ఉద్యోగాలు... డిగ్రీ పాస్ అయితే చాలు

Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో 100 ఉద్యోగాలు... డిగ్రీ పాస్ అయితే చాలు

Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో 100 ఉద్యోగాలు... డిగ్రీ పాస్ అయితే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో 100 ఉద్యోగాలు... డిగ్రీ పాస్ అయితే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Tech Mahindra Jobs | టెక్ మహీంద్రాలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) జాబ్ నోటీస్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  డిగ్రీ పాస్ అయినవారికి శుభవార్త. టెక్ మహీంద్రా (Tech Mahindra) ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ (ICSTP) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టెక్ మహీంద్రా. డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో ఉద్యోగాల వివరాలు ఇవే...


  భర్తీ చేసే పోస్టులు- కస్టమర్ సర్వీస్ అసోసియేట్

  మొత్తం ఖాళీలు- 100

  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2021 సెప్టెంబర్ 16

  రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 18

  ఇంటర్వ్యూ తేదీ- త్వరలో వెల్లడించనున్న టెక్ మహీంద్రా

  విద్యార్హతలు- డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 2015, 2016, 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఈ కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి.

  వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు

  Job Mela: మొత్తం 1,085 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ మేళా... రూ.60,000 వరకు వేతనం

  తెలియాల్సిన భాషలు- ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ (తప్పనిసరి), కన్నడ (తప్పనిసరి)

  ఎంపిక విధానం- టెలిఫోన్ ఇంటర్వ్యూ

  జాబ్ లొకేషన్- హైదరాబాద్

  శిక్షణా కాలం- 20 రోజులు

  వేతనం- ఏడాదికి రూ.1,64,000

  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  Assam Rifles Jobs 2021: టెన్త్ పాస్ అయినవారికి అస్సాం రైఫిల్స్‌లో 1230 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Tech Mahindra Jobs: దరఖాస్తు చేయండి ఇలా...


  Step 1- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ https://apssdc.in/industryplacements/ లో రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 2- ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజీలో ICSTP - Tech Mahindra - 6th Batch సెక్షన్‌లో More details పైన క్లిక్ చేయాలి.

  Step 3- ఆ తర్వాత Apply పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.

  Step 4- జిల్లా పేరు, ఆదార్ నెంబర్, అభ్యర్థి పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

  విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు టెక్ మహీంద్రా దరఖాస్తుల్ని పరిశీలిస్తుంది. అభ్యర్థులకు హెచ్ఆర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని హెచ్ఆర్ వివరిస్తారు.

  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటీసులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC. అభ్యర్థులు ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారిక వెబ్‌సైట్ https://apssdc.in/ ఫాలో కావాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Job notification, JOBS, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు