• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • APSSDC MEGA JOB MELA AT AVANIGADDA KRISHNA DISTRICT FOR VACANCIES IN VARIOUS COMPANIES HERE FULL DETAILS NS

APSSDC Jobs: ఏపీలో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమో అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే

APSSDC Jobs: ఏపీలో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమో అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఈ నెల 12న మరో సారి భారీ జాబ్ మేళాను నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ కంపెనీల్లో దాదాపు 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేల్ స్కిల్ డవప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఏపీలోని నిరుద్యోగులకు వరంలా మారింది. సంస్థ ఎప్పటికప్పుడు వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఖాళీల వివరాలను అర్హత కలిగిన నిరుద్యోగులకు చేరవేస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలోనే నిత్యం అనేక కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. అనేక మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ పై శిక్షణను సైతం అందిస్తున్నారు. తాజాగా APSSDC నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ నెల 12న కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి డిగ్రీ కాలేజీలో వివిధ కంపెనీల్లో ఖాళీల భర్తీకి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ఖాళీల వివరాలు..
    ఈ భారీ జాబ్ మేళా ద్వారా మొత్తం 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
    Flex india Pvt.Ltd: ఈ కంపెనీలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి రూ.14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, సబ్సిడీ ఫుడ్ తదితర సదుపాయాలు ఉంటాయి. అయితే కేవలం స్త్రీలు మాత్రే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Hero Moto Corp: ఈ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, సబ్సిడీ ఫుడ్ తదితర సదుపాయాలను అందించనున్నారు. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అర్హులు.


    Rising Stars Mobile India Pvt Ltd: ఈ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్, లైన్ లీడర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,200 నుంచి రూ.13 వేల వరకు వేతనం చెల్లించున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ తదితర సదుపాయాలను అందించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

    ఇతర వివరాలు..
    అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ నెల 12న కృష్ణ జిల్లా అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి డిగ్రీ కాలేజీలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 6300618985 నంబరును సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: