• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • APSSDC JOBS RECRUITMENT IN MALLADI DRUGS AND PHARMACEUTICALS LTD CHITTOR AP HERE FULL DETAILS NS

APSSDC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలకు ఈ రోజు ఇంటర్వ్యూలు.. వివరాలివే

APSSDC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలకు ఈ రోజు ఇంటర్వ్యూలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. Malladi Drugs and Pharmaceuticals Ltdలో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంస్థ నుంచి ప్రకటన విడుదల చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. Malladi Drugs and Pharmaceuticals Ltdలో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంస్థ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ద్వారా 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని ప్రకటనలో పేర్కొన్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ ప్రకటన ద్వారా Malladi Drugs and Pharmaceuticals Ltdలో మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రైనీ, కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్), డిప్లొమో(ఎలక్ట్రికల్/మెకానికల్), బీఎస్సీ(కెమిస్ట్రీ), ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ), బీటెక్(కెమికల్) విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1.64 లక్షలు(జూనియర్ లెవల్), అనుభవం కలిగిన వారికి ఏడాదికి రూ.4 లక్షల వరకు వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు plot no.49, 50, 55 & 56 Gajulamandayam, IDA, Attur(Po), Renigunta, Chittor-517520 చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.
    Registration-Direct Link



    ఇంటర్వ్యూ వివరాలు..
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు SIEMENS CENTRE OF EXCELLENCE, SVU COLLEGE OF ENGINEERING, Gate No-4, SV UNIVERSITY, TIRUPATI, CHITTOOR DIST-517501 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు మార్చి 8న ఉదయం 9 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
    -మొదటగా APSSDC వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
    -ఇతర వివరాలకు 8886086072 నంబరును సంప్రదించవచ్చు.
    -ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు Resume, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు, విద్యార్హతల ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: