ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రముఖ ఫ్లిప్ కార్ట్ (Flipkart) సంస్థలో ఖాళీల భర్తీకి జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాను ఒంగోలులో (Ongole) నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఫ్లిప్ కార్ట్ సంస్థలో డెలివరీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుంది.
Jobs In Canara Bank: కెనరా బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..
@AP_Skill has Collaborated with @Flipkart to Conduct Industry Customized Skill Training & Placement Program #PrakasamDistrict
For more details on eligibility visit https://t.co/XnrotfY4b3
Contact: Ms. B. Ankamma - 96525 18187
APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/rni1hTxWhm
— AP Skill Development (@AP_Skill) August 27, 2022
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు APSSDC Office, OLD Rims Compound, Opp. Collector Office, Ongole, Prakasham Dist. చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- హెచ్ఆర్&ఫైనల్ రౌండ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- ఇతర పూర్తి వివరాలకు 9652518187 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Flipkart, Job Mela, JOBS, Ongole, Private Jobs