Home /News /jobs /

APSSDC JOB MELA ON AUGUST 20 IN ANATHAPUR FOR VARIOUS JOB VACANCIES AT KIA MOTORS AND TATA PLAY HERE FULL DETAILS NS

AP Job Mela: ఏపీలో రేపు జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసిన వారికి జాబ్స్.. రూ.25 వేల వరకు వేతనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. రేపు మరో జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Vijayawada
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల జాబ్ మేళాలకు సంబంధించి వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ఈ జాబ్ మేళాల ద్వారా అన్ని విద్యార్హతలు కలిగిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది ఏపీలోని జగన్ సర్కార్. తాజాగా మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి ప్రకటన విడుదల చేసింది APSSDC. కియా మోటార్స్ (KIA Motors) తో పాటు TATA Play సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాను అనంతపురంలో నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి ప్రకటనలో తెలిపారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    KIA Motors: ఈ సంస్థలో NEEM Trainee విభాగంలో ఈ ఖళీలు ఉన్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఈ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీటెక్/డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవడానికి అర్హులని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు రూ.100 అటెండెన్స్ బోనస్ అందించనున్నారు. ఇంకా ఉచిత ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం సైతం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు అధికారులు.
    AP Government Jobs: ఏపీలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి



    Tata Play: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. Promotors విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ మరియు ఆపై విద్యార్హతల కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు అనంతపూర్ జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.


    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ అంటే శనివారం ఉదయం 10 గంటలకు Govt ITI College(Boys), Near Court Road - Anantapur చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
    - ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల జిరాకక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఇతర పూర్తి వివరాలకు 8317520929 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, JOBS, KIA Motors, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు