Home /News /jobs /

APSSDC JOB MELA IN ANDHRA PRADESH ON TODAY AUGUST 10 HERE IS REGISTRATION PROCESS NS

AP Job Mela: ఏపీలో ఈ రోజు మరో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో.. రూ.15 వేల వేతనంతో జాబ్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ రోజు మరో జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ అపోలో ఫార్మసీతో పాటు MMC Health Care Charitable Trust సంస్థలో ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Apollo Pharmacy: అపోలో ఫార్మసీ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసీ అసిస్టెంట్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ, ఎం, డీ ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు కాకినాడ, రాజమండ్రిలో పని చేయాల్సి ఉంటుంది.
    MMC Health Care: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు బేసిక్ కేర్ టేకర్ గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు వైజాగ్ లేదా హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
    Jobs In Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. 296 పోస్టులకు నోటిఫికేషన్..



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు ముందుగా www.apssdc.in లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఇంటర్వ్యూలను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ ఆస్ప్రతి దగ్గర, దేవీపట్నం రోడ్, రంపచోడవరం-533288 చిరునామాలో నిర్వహించనున్నారు.
    - అభ్యర్థులు మరింత సమాచారం కోసం 6304634447, 6301534435 నంబర్ ను సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు