హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela in AP: ఏపీలో రేపు మరో జాబ్ మేళా..టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Job Mela in AP: ఏపీలో రేపు మరో జాబ్ మేళా..టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29న ఉదయం 8.30 నిమిషాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29న ఉదయం 8.30 నిమిషాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ Greentech Industries India Pvt Ltd సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను (Job Interviews) నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.


    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ట్రైనీ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ మెకానికల్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సు 18-29 ఏళ్లు ఉండడాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది.

    Job Mela In Hyderabad: హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 7 వేల జాబ్స్ .. ఇలా రిజిస్టర్ చేసుకోండి




    ఇతర వివరాలు:

    - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    రిజిస్టర్ చేసుకున్న వారికి హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడపతారు.

    - ఎంపికైన వారు APIIC MP SEZ, Naidupeta చిరునమాలో పని చేయాల్సి ఉంటుంది.

    - అభ్యర్థులు ఇంటర్వ్యూలకు విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ తీసుకురావాల్సి ఉంటుంది.


    - ఎంపికైన వారికి ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్యాట్యూటీ, బోనస్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ అన్ లిమిటెడ్ ఫుడ్ సదుపాయం ఉంటుంది.

    - ఇంటర్వ్యూలను SVA.Degree College, Pichatur Road, Srikalahasti, Tirupati చిరునామాలో నిర్వహించనున్నారు.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు