హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: మొత్తం 350 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా... టెన్త్ పాస్ అయితే చాలు

Job Mela: మొత్తం 350 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా... టెన్త్ పాస్ అయితే చాలు

ఏపీ స్కిల్ డెవెల‌ప్‌మెంట్‌

ఏపీ స్కిల్ డెవెల‌ప్‌మెంట్‌

APSSDC Job Mela | ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రకాశం జిల్లా చీరాలలో జాబ్ మేళా (Job Mela) నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళా ప్రకటించింది. ప్రకాశం జిల్లా చీరాలలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ (Skill Connect Drive) నిర్వహిస్తోంది. 2021 సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా (Job Mela) ప్రారంభం అవుతుంది. ప్రకాశం జిల్లా చీరాలలోని ఇపురుపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో గల SKBM ఐటీఐ కాలేజీలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC). హీరో మోటోకార్ప్, డిక్సన్ టెక్నాలజీ లిమిటెడ్, టాటా స్టీల్, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, డెల్హివరీ సంస్థలు పలు ఖాళీలను భర్తీ చేయనున్నాయి. అభ్యర్థులు ముందుగా https://apssdc.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. జాబ్ మేళాలో పాల్గొనే సంస్థల వివరాలు, ఖాళీలు, వేతనాల వివరాలు తెలుసుకోండి.

  Hero Motocorp: హీరో మోటోకార్ప్‌లో 100 ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఏ ట్రేడ్‌లో అయినా ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్లు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14,977 వేతనం లభిస్తుంది. శ్రీ సిటీ నెల్లూరులో ఈ పోస్టులున్నాయి.

  TCS NQT 2021: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ దరఖాస్తుల్ని ప్రారంభించిన టీసీఎస్

  Dixon Technology: డిక్సన్ టెక్నాలజీస్‌లో 50 లైన్ ఆపరేటర్స్, హెల్పర్స్ పోస్టులున్నాయి. ఏ ట్రేడ్‌లో అయినా ఐటీఐ, డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 26 ఏళ్లు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 వేతనం లభిస్తుంది. తిరుపతిలో ఈ పోస్టులున్నాయి.

  Tata Steel: టాటా స్టీల్‌లో 50 ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఏ ట్రేడ్‌లో అయినా ఐటీఐ, డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 26 ఏళ్లు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,000 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది. సూళ్లూరుపేటలో ఈ పోస్టులున్నాయి.

  BSF Constable Jobs 2021: టెన్త్ పాస్ అయినవారికి బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్ జాబ్స్... రూ.69,100 వేతనం

  Greentech Industries: గ్రీన్‌టెక్‌లో 100 మెషీన్ ఆపరేటర్ పోస్టులున్నాయి. టెన్త్, ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 వేతనం లభిస్తుంది. నాయుడుపేటలో ఈ పోస్టులున్నాయి.

  Airtel Payments Bank: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో 25 ప్రమోటర్ పోస్టులున్నాయి. ఇంటర్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్లు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.13,000 వేతనం లభిస్తుంది. ప్రకాశం జిల్లాలో ఈ పోస్టులున్నాయి.

  Delhivery: డెల్హీవరీలో 25 డెలివరీ బాయ్స్ పోస్టులున్నాయి. టెన్త్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 వేతనం లభిస్తుంది. ప్రకాశం జిల్లాలో ఈ పోస్టులున్నాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Chirala, Job notification, JOBS, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు