Online Training: డిగ్రీ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డిజిటల్ మార్కెటింగ్ పై ఆన్లైన్లో ఉచిత శిక్షణ.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిజిటల్ మార్కెటింగ్ పై ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అనేక రకాల చర్యలు చేపడుతోంది. యువతకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చి వివిధ సంస్థల్లో ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇటీవల సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. అపోలో ఫార్మసీ, అమర రాజా, కియా మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఫ్లిప్ కార్ట్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తదితర ప్రముఖ సంస్థలతో పాటు ఇతర అనేక కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా డిజిటల్ మార్కెటింగ్ పై ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ అందించేందుకు APSSDC నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ శిక్షణ ఈ నెల 14 న ప్రారంభమై 25 వ తేదీ వరకు దాదాపు 10 రోజుల పాటు కొనసాగనుంది. ప్రతీ రోజు ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది.
    PGCIL Recruitment 2021: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో మూడు రోజులే గడువు.. ఇలా అప్లై చేయండి
    Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్

    డిగ్రీ చేసిన అభ్యర్థులంతా ఈ శిక్షణలో పాల్గొనేందుకు అర్హులని ప్రకటనలో స్పష్టం చేశారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ-సర్టిఫికేట్ అందిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
    Registration - Direct Link



    కరోనా నేపథ్యంలో డిజిటల్ మార్కెటింగ్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఈ కోర్సుకు విపరీమైన ఆదరణ పెరిగింది. అభ్యర్థులు ఈ ఆన్లైన్ ట్రైనింగ్ కు హాజరైతే ఉచితంగా శిక్షణతో పాటు సర్టిఫికేట్ అందుకోవచ్చు. అనంతరం వివిధ సంస్థల్లో డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదలైన సమయంలో అప్లై చేసి ఉద్యోగం పొందొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: